ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సమీర్ శర్మ సోమవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. ఇటీవలనే ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సమీర్ శర్మ సోమవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ నెల 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆదిత్యనాథ్ దాస్ కి ఇప్పటికే మూడు మాసాలు పొడిగించింది. మరోసారి పొడిగింపునకు ఏపీ సర్కార్ సుముఖంగా లేదు. దీంతో కొత్త సీఎస్‌గా సమీర్ శర్మను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవలనే ఉత్తర్వులు జారీ చేసింది.
also read:ఏపీ కొత్త సీఎస్‌గా సమీర్ శర్మ:అక్టోబర్ 1న బాధ్యతల స్వీకరణ
దీంతో కొత్తగా సీఎస్‌గా నియమితులైన సమీర్ శర్మ ఏపీ సీఎం వైఎస్ జగన్ ను సోమవారం నాడు క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళికా, రిసోర్స్ మొబిలైజేషన్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శర్మ విధులు నిర్వర్తిస్తున్నారు. నీలం సహానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైరైన తర్వాత ఆదిత్యనాథ్ దాస్ సీఎస్ గా నియమితులయ్యారు. ఆదిత్యనాథ్ దాస్ తర్వాత సమీర్ శర్మ నియమితులయ్యారు.