అమరావతిలో దారుణం... ప్రభుత్వ అధికారిపై వైసిపి నేత దాడి (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 13, 2021, 06:08 PM ISTUpdated : Sep 13, 2021, 06:15 PM IST
అమరావతిలో దారుణం... ప్రభుత్వ అధికారిపై వైసిపి నేత దాడి (వీడియో)

సారాంశం

ప్రభుత్వ ఉద్యోగిపై వైసిపి నాయకుడు దాడికి పాల్పడిన ఘటన అమరావతిలో చోటుచేసుకుంది. 

అమరావతి: అధికార వైసిపి పార్టీ నాయకుడొకరు ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి పాల్పడిన ఘటన గుంటూరు జల్లాలో చోటుచేసుకుంది. అమరావతి పంచాయితీ కార్యదర్శి మోహన్ చంద్ పై స్థానిక వైసిపీ నేత హనుమంతరావు దాడికి పాల్పడ్డాడు. తనకు సంబంధించిన పంచాయితీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులనే తొలగిస్తావా అంటే కార్యదర్శిపై దాడికి పాల్పడ్డాడు వైసిపి నేత. 

విధుల్లో వున్న పంచాయితీ కార్యదర్శిపై జరిగిన దాడిని నిరసిస్తూ అమరావతి పంచాయితీ ఆఫీస్ ఎదుట కార్యదర్శుల ఆందోళన చేపట్టారు. కార్యదర్శి మోహన్ దాడిచేసిన వారిని వెంటనే శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శి మోహన్ చంద్ కూడా తనపై జరిగిన దాడిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

వీడియో

తన విధులకు ఆటంకం కలిగిస్తూ పంచాయితీ కార్యాలయంలోనే తనపై స్థానిక వైసిపి నేత హనుమంత రావు ఆయన తమ్ముడు శంకర్ తో పాటు మరికొందరు దాడికి పాల్పడినట్లు పంచాయితీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బూతులు తిడుతూ దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మోహన్ చంద్  కోరారు. 

పోలీసులకు పంచాయితీ కార్యదర్శి అందించిన ఫిర్యాదు: 

PREV
click me!

Recommended Stories

Vemireddy Prashanthi Emotional Speech In Mahanadu | వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు
Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్