కరోనా కల్లోలం: కోవిడ్ తో ఏపీహైకోర్టులో ఇద్దరు ఉద్యోగుల మృతి

By narsimha lodeFirst Published Apr 19, 2021, 4:00 PM IST
Highlights

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో కరోనాతో ఇద్దరు ఉద్యోగులు మరణించారు. ఏపీ సచివాలయంలో కూడ కరోనాతో ఇప్పటికే నలుగురు మృతి చెందారు. 
 

ఏపీ హైకోర్టులో  టైపిస్ట్‌గా పనిచేస్తున్న సుబ్రమణ్యం , జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీలతలు కరోనాతో మరణించారు. కరోనాతో ఇద్దరు ఉద్యోగులు మరణించడంతో కోర్టు ఉద్యోగుల్లో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ లోనే  కేసుల విచారణ సాగుతోంది. కొందరు హైకోర్టులో పనిచేసే ఉద్యోగులు కొందరు విధులకు హాజరౌతున్నారు. 

also read:ఏపీ సచివాలయంలో కరోనా కలకలం... మరో మహిళా ఉద్యోగి మృతి

ఇదిలా ఉంటే కరోనా కేసులు పెరుగుతున్నందున  ఈ నెల 20వ తేదీ నుండి  ఈ నెల 30 వ తేదీ వరకు విజయవాడ బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని  మూసివేయాలని  నిర్ణయం తీసుకొన్నారు. .కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది.  కరోనాపై సీఎం జగన్  ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.  కరోనా కేసులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకుగాను  ఏపీ సర్కార్  వ్యాక్సినేషన్ పై కూడ కేంద్రీకరించింది. రాష్ట్రంలో అవసరమైన టీకాలను సరఫరా చేయాలని  ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.  

click me!