పొలం వివాదం: రెచ్చిపోయిన మాజీ జవాన్, రైతులపై కాల్పులు.. ఇద్దరి మృతి

By Siva Kodati  |  First Published Aug 29, 2021, 8:38 PM IST

గుంటూరు జిల్లా మాచర్ల మండలం రాయవరంలో మాజీ సైనికుడు రెచ్చిపోయాడు. పొలం వివాదం నేపథ్యంలో అతను ఇద్దరు రైతులను కాల్చి చంపాడు. మృతులను శివ, బాలకృష్ణగా గుర్తించారు. 
 


గుంటూరు జిల్లాలో వరుస దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం రాత్రి సత్తెనపల్లిలో తల్లీకూతుళ్లను ఓ ఉన్మాది హత్య చేయగా.. ఆదివారం గుంటూరులోని బొంతపాడు వద్ద ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. తాజాగా మాచర్ల మండలం రాయవరంలో మాజీ సైనికుడు తుపాకీతో రెచ్చిపోయాడు. ఈ ఘటనలో ఇద్దరు రైతులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పొలం వివాదం నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన మాజీ సైనికుడు మట్టా సాంబశివరావు తుపాకీతో ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో శివ, బాలకృష్ణ మృతి చెందారు. ఆంజనేయులు అనే రైతుకు తీవ్రగాయాలవ్వడంతో మాచర్ల ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 

click me!