కర్నూల్‌లో బాంబు పేలుడు: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి, ఆ బాంబు ఎలా వచ్చింది?

First Published Jul 31, 2018, 1:05 PM IST
Highlights

 కర్నూల్‌లోని డంపింగ్ యార్డు వద్ద మంగళవారం నాడు బారీ పేలుడు సంభవించింది.ఈ పేలుడులో ముగ్గురు మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


కర్నూల్: కర్నూల్‌లోని నంద్యాల రోడ్డులోని  డంపింగ్ యార్డు వద్ద మంగళవారం నాడు బారీ పేలుడు సంభవించింది.ఈ పేలుడులో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  గాయపడిన వారిని  చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరోకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరుకొంది. 


కర్నూల్ పట్టణంలోని నంద్యాల చెక్ పోస్టు నుండి జోహరాపురానికి వెళ్లే రహదారి పక్క పొలాల్లో బాంబు పేలి ముగ్గురు మరణించారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారిని జంపాల మల్లిఖార్జున, జంపాల రాజశేఖర్, జంపాల శ్రీనివాసులుగా గుర్తించారు. జంపాల రాజశేఖర్, మల్లిఖార్జున్ రియల్ ఏస్టేట్ వ్యాపారం చేసేవారు. కర్నూల్ నగర శివార్లలో రూ. 20 కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేశారు. 

ఈ భూమిని సర్వే చేసేందుకు వీలుగా ఇక్కడ ఉన్న చెత్తను పోగు చేసి నిప్పుపెట్టారు. దీంతో పేలుడు సంభవించింది.మల్లికార్జునరెడ్డి, రాజశేఖర్ అక్కడికక్కడే మృతిచెందారు.  శ్రీనివాసులు, సుధాకర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాసులు మరణించాడు.

జంపాల సోదరులు ఈ ఘటనలో మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరౌతున్నారు. కర్నూల్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మృతుల కుటంబాలను పరామర్శించారు. 

అయితే ఘటన స్థలంలో బాంబు ఎలా వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాంబును ఇక్కడ ఎవరు అమర్చారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. యాధృచ్చికంగా ఈ ఘటన జరిగిందా...ఉద్దేశ్యపూర్వకంగా ఎవరైనా ఈ బాంబును అమర్చారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


 

click me!