గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇద్దరికి కరోనా సోకింది. కరోనా సోకిన ఇద్దరిని హోం ఐసోలేషన్ కు తరలించారు.
గుంటూరు: గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది. జ్వరంతో బాధపడుతున్న ఇద్దరు ఆసుపత్రికి వెళ్లారు . ఈ ఇద్దరికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. కరోనా లక్షణాలు కన్పించడంతో టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో వీరిద్దరికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఈ ఇద్దరిని చికిత్స అందించి హోం ఊసోలేషన్ కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా రెండు కేసులు నమోదు కావడంపై వైద్య, ఆరోగ్య శాఖాధికారులు అలర్టయ్యారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ ఇద్దరిని ఎవరెవరు కలిశారనే విషయాలపై వైద్య, ఆరోగ్య శాఖాధికారులు ఆరా తీస్తున్నారు.
undefined
దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల నమోదౌతుంది. దేశంలో 7 వేల యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో వెయ్యి కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేయనుంది. కరోనా విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
also read:భారత్ లో పెరుగుతున్న కోవిడ్.. ఒకే రోజులో 1,071 కొత్త కేసులు నమోదు.. 129 రోజుల తరువాత అత్యధికం
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది ఆరంభంలో కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. లేకపోతే ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. జనవరి మాసంలో కొత్త సంవత్సరం, పండుగల నేపథ్యంలో కరోనా ప్రబలే అవకాశం ఉందని వైద్య, ఆరోగ్య శాఖాధికారులు హెచ్చరించారు. దీంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఇటీవల కాలంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమించాయి.