మామిడి కాయలు కోసుకోవడానికి వెళ్తే.. మృత్యువు కబళించింది

Siva Kodati |  
Published : May 26, 2021, 06:19 PM IST
మామిడి కాయలు కోసుకోవడానికి వెళ్తే.. మృత్యువు కబళించింది

సారాంశం

విశాఖపట్నంలో దారుణం జరిగింది. చెట్టు కొమ్మలు విరిగిపడి పడి ఇద్దరు బాలురు దుర్మరణం పాలయ్యారు. తుఫాను ప్రభావంతో విశాఖ మన్యంలో భారీ గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాడేరు మండలం పిల్లిపుట్టు గ్రామంలో మామిడి కాయలు సేకరించేందుకు వెళ్లారు ఇద్దరు చిన్నారులు

విశాఖపట్నంలో దారుణం జరిగింది. చెట్టు కొమ్మలు విరిగిపడి పడి ఇద్దరు బాలురు దుర్మరణం పాలయ్యారు. తుఫాను ప్రభావంతో విశాఖ మన్యంలో భారీ గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాడేరు మండలం పిల్లిపుట్టు గ్రామంలో మామిడి కాయలు సేకరించేందుకు వెళ్లారు ఇద్దరు చిన్నారులు.

అయితే ఒక్కసారిగా భారీ ఈదురు గాలులు వీయడంతో వాటి తీవ్రతకు మామిడి చెట్టు కొమ్మలు విరిగి చిన్నారులపై పడ్డాయి. ఈ ఘటనలో మర్రి చరణ్ (13), సీదరి వినీత్ (1౦) అక్కడికక్కడే మరణించారు. వీరి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?