ఏపీలో మళ్లీ కరోనా కలవరం: భారీగా పెరిగిన కేసులు.. తూ.గోలో అత్యధికం, చిత్తూరులో మృత్యుఘోష

Siva Kodati |  
Published : May 26, 2021, 05:53 PM IST
ఏపీలో మళ్లీ కరోనా కలవరం: భారీగా పెరిగిన కేసులు.. తూ.గోలో అత్యధికం, చిత్తూరులో మృత్యుఘోష

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. గత రెండు, మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసులు.. ఇవాళ భారీగా పెరిగాయి. దీంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. కర్ఫ్యూతో పాటు ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నా కేసులు పెరగడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 18,285 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 16,27,390కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 99 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 10,427కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 9, ప్రకాశం 8, అనంతపురం 8, తూర్పుగోదావరి 8, చిత్తూరు 15, గుంటూరు 5, కర్నూలు 6, నెల్లూరు 8, కృష్ణ 5, విశాఖపట్నం 8, శ్రీకాకుళం 5, పశ్చిమ గోదావరి 14 మంది చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 24,105 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 14,24,859కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 91,120 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,88,40,321కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,92,104 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 1876, చిత్తూరు 1822, తూర్పుగోదావరి 3296, గుంటూరు 1211, కడప 877, కృష్ణ 652, కర్నూలు 1026, నెల్లూరు 1159, ప్రకాశం 1056, శ్రీకాకుళం 1207, విశాఖపట్నం 1800, విజయనగరం 639, పశ్చిమ గోదావరిలలో 1664 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.
 
PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu