విశాఖ : హెచ్‌పీసీఎల్‌ అగ్నిప్రమాదంపై విచారణ.. ఐదుగురు సభ్యులతో కమిటీ నియామకం

By Siva Kodati  |  First Published May 26, 2021, 5:21 PM IST

విశాఖ హెచ్‌పీసీఎల్‌లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపై ఐదుగురు సభ్యుల సాంకేతిక కమిటీతో విచారణకు ఆదేశించారు కలెక్టర్ వినయ్ చంద్. సీడీయూ-3లో ప్రమాదం, ఆయిల్ లీక్‌కు గల కారణాలను విశ్లేషించనుంది కమిటీ. ఐఐపీఎం, ఆంధ్రా యూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్ నిపుణులతో సాంకేతిక, భద్రతాపరమైన విచారణ జరుగుతుంది. దీనిపై వారం రోజుల్లోనే కలెక్టర్‌ను నివేదిక అందజేయనుంది కమిటీ. 

Also Read:విశాఖ హెచ్పీసీఎల్ భారీ అగ్నిప్రమాదం... కమ్ముకున్న నల్లని పొగలు

Latest Videos

కాగా, విశాఖపట్నంలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)‌లో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించి, దట్టమైన పొగలతో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఉద్యోగులను బయటకు పంపారు. ముడి చమురును ఈ యూనిట్‌లోనే ప్రాసెసింగ్‌ చేస్తారు. ఈ ప్రమాదంలో యూనిట్‌ మొత్తం మంటలు వ్యాపించినట్లు తెలిసింది.

click me!