చనిపోయినా విజయం సాధించారు: ఏలూరు కార్పోరేషన్‌లో ఇద్దరు వైసీపీ అభ్యర్ధులు

By narsimha lodeFirst Published Jul 25, 2021, 12:34 PM IST
Highlights

ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల్లో  వైసీపీ హావా సాగుతోంది. ఈ కార్పోరేషన్ ఎన్నికల్లో 42, 46 డివిజన్లలో వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. కానీ వీరిద్దరూ మరణించారు. 42వ డివిజన్ నుండి  ముఖర్జీ, 46వ డివిజన్ నుండి ప్యారీ బేగం చనిపోయారు. 

ఏలూరు: ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ హావా సాగుతోంది. ఇప్పటికే ఈ కార్పోరేషన్లో మూడు స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకొంది. ఇవాళ జరిగిన ఓట్ల లెక్కింపులో   నాలుగు డివిజన్లలో   వైసీపీ విజయం సాధించింది.38,39,41,42, 46 డివిజన్లలో వైసీపీ విజయం సాధించింది. 42 వ డివిజన్ నుండి ముఖర్జీ, 46వ డివిజన్ నుండి ప్యారీ బేగం విజయం సాధించారు. వీరిద్దరూ ఇటీవల కాలంలో మరణించారు. ఎన్నికలు మార్చి 10వ తేదీన జరిగాయి. ఓట్ల లెక్కింపు ఇవాళ జరుగుతోంది. దీంతో ఈ రెండు స్థానాలకు ఆరు మాసాల లోపు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

also read:ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు ప్రారంభం

హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం ఓట్లను లెక్కిస్తోంది. ఏలూరులోని సీఆర్‌రెడ్డి కాలేజీలోని నాలుగు కౌంటింగ్ సెంటర్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.ఇవాళ మధ్యాహ్నం వరకు ఏలూరు కార్పోరేషన్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకొన్న విషయం తెలిసిందే.

click me!