విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల జేఎసీ పాదయాత్ర నిర్వహించింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆగష్టు 1,2 తేదీల్లో చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కార్మిక సంఘాల జేఎసీ నేతుల తెలిపారు.
విశాఖపట్టణం: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం నాడు పాదయాత్ర నిర్వహించారు.కూర్మన్నపాలెం జంక్షన్ నుండి దువ్వాడ వరకు యాత్ర నిర్వహించారు. కార్మికులు పెద్ద సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొన్నారు. నిర్వాసితుల కాలనీల్లో కూడ స్టీల్ ప్లాంట్ కార్మికులు యాత్ర కొనసాగించారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆగష్టు 1,2 తేదీల్లో ఛలో పార్లమెంట్ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది.కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొనేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని జేఎసీ నేతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాలు రిలే నిరహారదీక్షలు చేస్తున్నాయి.ఈ దీక్షలు ఆదివారం నాటికి 164వ రోజుకు చేరుకొన్నాయి.
విశాఖ స్టీీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని ఏపీ ప్రభుత్వం కూడ కేంద్రాన్ని కోరింది. ఏపీ అసెంబ్లీ కూడ తీర్మానం చేసింది. ఈ విషయమై ప్రధానికి సీఎం జగన్ లేఖ కూడ రాశారు. అఖిలపక్షాన్ని తీసుకొచ్చేందుకు అనుమతివ్వాలని కూడ ప్రధానిని జగన్ కోరారు. రాష్ట్రంలోని అధికార, విపక్షాలన్నీ కూడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి.