పరాయి దేశం నుంచి వచ్చి.. వృద్ధ దంపతులను నమ్మించి.. ఘరానా మోసం

By telugu teamFirst Published Nov 14, 2019, 9:24 AM IST
Highlights

కేరళలోని ఓ గుడి నిర్మాణ పనుల్లో కూలీలుగా రెండు రోజులు పనిచేశారు. ఆ తర్వాత మరోచోట గడ్డికోసే పనికి మారారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో నివసిస్తున్న వృద్ధ దంపతులతో పరిచయం పెంచుకున్నారు.

బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి చొరపడ్డారు. కూలి పనులు చేసుకోవడానికి వచ్చామంటూ అందరినీ నమ్మించారు. కేరళలో ఒంటరిగా నివసిస్తున్న దంపతులపై కన్నేశాడు. ఆ వృద్ధ దంపతులను హత్య చేసి ఆభరణాలతో పరారయ్యారు. తీరా విశాఖలో పోలీసులకు చిక్కారు.

ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..  బంగ్లాదేశ్ కి చెందని జువెల్ హుస్సేన్(21), లాబ్లూ హుస్సేన్(33) పది రోజుల క్రితం మన దేశంలోకి ప్రవేశించారు.  కేరళలోని ఓ గుడి నిర్మాణ పనుల్లో కూలీలుగా రెండు రోజులు పనిచేశారు. ఆ తర్వాత మరోచోట గడ్డికోసే పనికి మారారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో నివసిస్తున్న వృద్ధ దంపతులతో పరిచయం పెంచుకున్నారు.
 
వారి ఒంటిపై బంగారు ఆభరణాలు గమనించి, ఇంట్లో డబ్బు ఎక్కువగా ఉండొచ్చని భావించారు. ఈ నెల 11న వృద్ధ దంపతుల ఇంట్లోకి చొరబడి వారిపై ఇనుపరాడ్లతో దాడిచేసి హతమార్చారు. సొత్తు సర్దుకుని 12న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. అయితే అక్కడి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేరళ పోలీసుల నుంచి మంగళవారం విశాఖపట్నం ఆర్పీఎఫ్‌ పోలీసులకు సమాచారం వచ్చింది.

 అనుమానితుల ఫొటోలు పంపడంతో ఈ మేరకు విశాఖ రైల్వేస్టేషన్‌లో పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించారు. తనిఖీలు చేస్తుండగా, పారిపోయేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.11 లక్షల విలువైన బంగారు ఆభరణాలుస్వాధీనం చేసుకున్నారు.

click me!