ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ: నేడు బాధ్యతల స్వీకరణ

By narsimha lode  |  First Published Nov 14, 2019, 7:49 AM IST

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానిని నియమిస్తూ బుధవారం నాడు ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని గురువారం నాడు బాధ్యతలను స్వీకరించనున్నారు.



అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ ఉదయం ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని బాధ్యతలను చేపట్టనునన్నారు.

ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం,ఎంపవర్మెంట్ కార్యదర్శిగా పనిచేసిన నీలం సహానీ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుండి రిలీవ్ అయ్యారు..1984వ ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆమె గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మచిలీపట్నంలో అసిస్టెంట్ కలక్టర్ గా పనిచేశారు.అలాగే టెక్కలి సబ్ కలక్టర్ బాధ్యతలు నిర్వహించారు.

Latest Videos

Also read:ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ: నేడో రేపో ఉత్తర్వులు

నల్గొండ జిల్లా కలెక్టర్ గా సుధీర్ఘంగా ఆమె పనిచేశారు..అదే విధంగా మున్సిపల్ పరిపాలనశాఖ డిప్యూటీ సెక్రటరీగా,హైదరాబాదులో స్త్రీశిశు సంక్షేమశాఖ పిడిగాను పనిచేశారు. నిజామాబాదు జిల్లాలో జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ గా,,ఖమ్మం జిల్లాల్లో కాడా(CADA)అడ్మినిస్ట్రేటర్ గాను పనిచేశారు

అదే విధంగా క్రీడల శాఖ కమీషనర్, శాప్ విసిగా పని చేశారు.అనంతరం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా కేంద్రంలో పనిచేసిన అనంతరం ఎపిఐడిసి కార్పొరేషన్ విసి అండ్ ఎండిగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేశారు.అనంతరం స్త్రీశిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 

2018 నుండి కేంద్ర సామాజిక న్యాయం మరియు ఎంవపర్మెంట్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వారం రోజుల క్రితమే నీలం సహానీ కేంద్ర సర్వీసుల నుండి రిలీవ్ అయయ్యారు. 

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు.గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సతీనాయర్, మిన్నీ మాధ్యూలు మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని బాధ్యతలు చేపట్టనున్నారు.

నీలం సహాని 1984 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి. సమీర్ శర్మ 1985 బ్యాచ్ అధికారి. సమీర్ శర్మ ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. నీలం సహాని 2020 జూన్ 30వ తేదీన రిటైర్ కానున్నారు. ఈ ఇద్దరు అధికారుల్లో నీలం సహాని వైపే వైఎస్ జగన్ మొగ్గు చూపారు.

Also Read:సీఎస్‌గా నీలం సహాని వైపు జగన్ మొగ్గు: కేంద్రం చేతుల్లోనే

సీఎస్ హోదాలో ఎల్ వి సుబ్రహ్మణ్యం సీఎంఓ కార్యాలయ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కు షోకాజ్ నోటీసు ఇచ్చారు. బిజినెస్ రూల్స్ ను అతిక్రమిస్తున్న విషయమై  ఈ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ షోకాజ్ నోటీసు జారీ చేసిన  తర్వాత ఎల్వీ సుబ్రమణ్యాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుండి తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.  

ఎల్వీ సుబ్రమణ్యాన్ని బాపట్ల హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్ పదవికి పోస్టింగ్ ఇచ్చారు. అయితే విధుల్లో చేరకుండానే ఎల్వీ సుబ్రమణ్యం సెలవులో వెళ్లిపోయారు. తాత్కాలిక సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ కు బాధ్యతలు అప్పగించిన తర్వాత ఎల్వీ సుబ్రమణ్యం సెలవులో వెళ్లాడు.

అడ్మినిస్ట్రేషన్‌లో నీలం సహానికి మంచి పట్టుంది. దీంతో ఏపీ రాష్ట్రానికి సీఎస్ గా నీలం సహానిని ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

    

click me!