ఇసుక కొరత: విజయవాడలో 12 గంటల దీక్షను ప్రారంభించిన చంద్రబాబు

By narsimha lode  |  First Published Nov 14, 2019, 8:34 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు గురువారం నాడు విజయవాడ ధర్నా చౌక్ లో 12 గంటల దీక్షను ప్రారంభించారు.



హైదరాబాద్: ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు గురువారం నాడు విజయవాడ దర్నా చౌక్‌లో 12 గంటల పాటు దీక్షను ప్రారంభించారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు చంద్రబాబునాయుడు దీక్ష చేయనున్నారు.

ఏపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక కొరత తీవ్రంగా ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 

Latest Videos

also read:చంద్రబాబు దీక్షకు సర్వం సిద్ధం: జనసేన సహా పలు పార్టీల మద్ధతు

చంద్రబాబునాయుడు ఇసుక కొరతపై చేపట్టిన దీక్షకు సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీలు మద్దతును ప్రకటించాయి. భవన నిర్మాణ కార్మికుల్లో భరోసా నింపడమే లక్ష్యంగా ఈ దీక్షను చేపట్టనున్నట్టు టీడీపీ ప్రకటించింది.ఏపీ రాష్ట్రంలో ఆత్మహత్యకు పాల్పడిన భవన నిర్మాణ కార్మికులతో చంద్రబాబునాయుడు దీక్షకు దిగారు.

ఉచిత ఇసుక విధానాన్ని పునరుద్ధరించడంతో పాటు ఇతర రాష్ట్రాలకు ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న మాఫియాను అరికట్టాలని, భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేలు భృతి, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.

Also Read:దోస్త్ మేరా దోస్త్: చంద్రబాబు దీక్షకు పవన్ మద్దతు, దీక్షకు జనసైనికులు

‘‘కావాలి ఉచిత ఇసుక-పోవాలి ఇసుక మాఫియా’’ నినాదంతో విజయవాడ ధర్నా చౌక్‌లో గురువారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష చేయనున్నారు.ఇసుక దీక్షకు రెండు రోజుల ముందు నుంచే తెలుగుదేశం పార్టీ విస్తృత ప్రచారం నిర్వహించింది.

 రాష్ట్రంలో ఇసుక మాఫియాతో సంబంధం ఉన్న 60 మంది వైసీపీ నేతల పేర్లతో చార్జ్‌షీట్‌ను విడుదల చేసింది.అటు బాబు దీక్షకు జనసేన, సీపీఐ, సీపీఎం, ఆప్ పార్టీలు సంఘీభావాన్ని తెలిపాయి.

Also Read:ఇసుక అక్రమ రవాణా చేస్తే రూ.2 లక్షలు జరిమానా: ఏపీ కేబినెట్ నిర్ణయం

చంద్రబాబు నాయుడు దీక్షపై వివరించారు. చంద్రబాబు చేపట్టనున్న ఇసుక దీక్షకు మద్దతు పలకాలంటూ కోరారు. మరో వైపు ఏపీ ప్రభుత్వం ఈ నెల 14వ తేదీ నుండే ఇసుక వారోత్సవాలను నిర్వహించనుంది.

ఇసుక కొరతపై ఈ నెల 3వ తేదీన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విశాఖపట్టణంలో లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఇసుక కొరతపై రాష్ట్రంలో విపక్షాలు ఏదో రూపంలో ఆందోళన నిర్వహిస్తున్నాయి. గత మాసంలో ఇసుక కొరతను నిరసిస్తూ లోకేష్ గుంటూరు కలెక్టేరేట్ వద్ద 12 గంటల పాటు దీక్షకు దిగాడు.

click me!