బెజవాడలో మహేష్ హత్య కేసులో ట్విస్ట్: కారు రివర్స్ చేసి....

By telugu teamFirst Published Oct 12, 2020, 2:31 PM IST
Highlights

బెజవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన మహేష్ హత్య కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మహేష్ ను హత్య చేయడానికి మిత్రుడు హరికృష్ణ సహకరించాడని ఆయన సోదరి సునీత అంటోంది.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో సంచలనం సృష్టించిన మహేష్ హత్య ఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అతని మిత్రుడు హరికృష్ణపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మహేష్ సోదరి సునీత మీడియాతో తన అనుమానాలను వెల్లడించారు 

తన సోదరుడిని పక్కా పథకంతో చంపేశారని సునీత చెప్పారు పొలాల మధ్య మిత్రులతో కలిసి మహేష్ ఉన్నాడనే విషయం తెలుసుకుని హరి అక్కడకు వెళ్లాడని, ఇంటికి వెళ్లిపోదామని అనుకుంటున్న సమయంలో మళ్లీ మద్యం సేవిద్దామని హరి ఆపాడని ఆమె చెప్పారు. 

Also Read: భార్యకు విడాకులు, మరో మహిళతో అఫైర్: ఎవరీ మహేష్?

డబ్బులు పెటిఎం చేసి మద్యం తీసుకుని రావాలని ఇద్దరిని బలవంతంగా పంపించాడని ఆమె తెలిపారు. మద్యం తేవడానికి ఇద్దరు వ్యక్తులు వెళ్లిన తర్వాత మరో ఇద్దరు వచ్ిచ తన తమ్ముడిపై కాల్పులు జరిపారని ఆమె చెప్పారు 

కాల్పులు జరిపిన వ్యక్తులు పారిపోవడానికి హరి కారను రివర్స్ చేసి వారికి ఇవ్వడం అనుమానాలకు తావు ఇస్తోందని సునీత అన్నారు. హరిని అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని ఆమె అన్నారు ప్రేమ వ్యవహారమని అందరూ అంటున్నారని, అది నిజం కాదని, తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమె అన్నారు రియల్ ఎస్టేట్ వివాదాలు ఉన్నాయనేది కూడా నిజం కాదని ఆమె చెప్పారు. 

పోలీసు కమిషనర్ ఆఫీసులో పనిచేస్తున్న మహేష్ అనే యువకుడిని దుండగులు విజయవాడలో కాల్చి చంపిన విషయం తెలిసిందే.   మహేష్ తన నలుగురు మిత్రులు కుర్ర హరికృష్ణ, ఉయ్యూరు దినేష్, యండ్రపతి గీతక్ సుమంత్ అలియాస్ టోనీ, కంచర్ల అనుదీప్ అలియాస్ దీపులతో కలిసి శనివారం రాత్రి నున్న బైపాస్ రోడ్డులోని ఓ బార్ లో మద్యం కొనుగోలు చేసి నున్న మ్యాంగో మార్కెట్ వైపు ఉన్న నిర్మానుష్యమైన ప్రదేశంలో రోడ్డుపైన కూర్చుని మద్యం సేవిస్తున్నారు.

బీరు సీసాలు ఖాళీకావడంతో, సిగరెట్లు అయిపోవడంతో మహేష్ స్నేహితులు టోనీ, అనుదీప్ వాటిని తెచ్చేందుకు బార్ వద్దకు వెళ్లారు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వచ్చి 7.65 ఎంఎం తుపాకీ చూపించి డబ్బులు కావాలంటూ మహేష్ తో గొడవకు దిగారు. 

పక్కన ఉన్న మిత్రులు సర్దిచెబుతుండగానే వెనక ఉన్న వ్యక్తి తుపాతికీతో మహేష్ పైకి కాల్పులు జరిపాడు. మహేష్ శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకుని వెళ్లాయి. దాంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత నిందితుల్లో ఒకతను స్కూటీపై, మరొకరు బాధితుల కారులో పారిపోయారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ముస్తాబాద్ రోడ్డులో వాటిని వదిలేశారు. 

click me!