ఏ1 చేతిలో తన్నులు తినకుండా చూసుకో.. ఏ2 : విజయసాయికి చురకలు వేసిన ర‌ఘురామ‌

By Rajesh KFirst Published Jan 21, 2022, 3:03 PM IST
Highlights

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మధ్య మాటల యుద్ధం శృతిమించుతోంది.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మధ్య మాటల యుద్ధం శృతిమించుతోంది. 'నలభై ఏళ్ల అనుభవమే ఈ వయసులో పక్కవాళ్ల‌కు ప్రేమ బాణాలు వేస్తుంటే అతని ప్రేమకోసం పడరాని పాట్లూ పడుతున్నావా ర‌ఘురామా?' అంటూ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. దీనిపై స్పందించిన‌ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ధీటుగా కౌంట‌ర్ ఇచ్చారు.

'నువ్వు నీ ప్రేమ బాణాలు విశాఖ నవ యువతుల మీద విసురుతున్నావు అంట కదా! పని చెయ్యకుండా ప్రజలను పీక్కుతింటున్న మిమ్మల్ని త్వరలో ఆ ప్రజలే రాళ్లతో కొడతారు. నువ్వు ఎన్ని ట్వీట్లు పెట్టినా ఏ1 నీకు రాజ్యసభ రెన్యువల్ చెయ్యడు అంట. ముందు నువ్వు ఏ1 చేతిలో తన్నులు తినకుండా ఉండేలా చూసుకో' అని ర‌ఘురామ‌ చుర‌క‌లంటించారు.

 

నువ్వు నీ ప్రేమ బాణాలు విశాఖ నవ యువతుల మీద విసురుతున్నావు అంట కదా! పని చెయ్యకుండా ప్రజలను పీక్కుతింటున్న మిమ్మల్ని త్వరలో ఆ ప్రజలే రాళ్లతో కొడతారు. నువ్వు ఎన్ని ట్వీట్లు పెట్టినా ఏ1 నీకు రాజ్యసభ రెన్యువల్ చెయ్యడు అంట. ముందు నువ్వు ఏ1 చేతిలో తన్నులు తినకుండా ఉండేలా చూసుకో. https://t.co/FlBmvkjyau

— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP)

 

గురువారం రాత్రి కూడా.. వీరిద్దరి మధ్య ట్వీట్ల వార్ జరిగింది. 'జీవితాన్ని రొచ్చు చేసుకున్నావు కదా రాజా! ఏదో ప్రాపర్టీనో, వాహనాలనో అద్దెకు ఇచ్చినట్టు... నిన్ను నువ్వే బాడుగకు ఇచ్చుకుని పెయిడ్ మైక్ అయ్యావు. లెక్క పంపిస్తే ట్వీట్లు, స్టేట్ మెంట్లు ఏదైనా చేస్తావు. ఇంత నీచపు జీవితం భారంగా లేదూ? గెలిపించిన ప్రజలను తాకట్టు పెట్టేశావు కదా!' అని విజయసాయి వ్యాఖ్యానించారు. 

విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు రఘురాజు కూడా ఘాటుగా బదులిచ్చారు. 'అవునా? నా జీవితం నీకు, ఏ1కి భారంగా ఉందనే కదా నన్ను కూడా కడతేర్చాలనుకుంటున్నారు... పాపం వివేకానందరెడ్డి లా! ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి, సొమ్ములు దోచేస్తున్న మిమ్మల్ని రొచ్చులో తొక్కే రోజు దగ్గర పడింది మిస్టర్ ఏ2!' అని సెటైర్ వేశారు.

కాగా.. కాగా..  జార్ఖండ్ కు చెందిన వారితో తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని Raghurama krishnam raju సంచలన ఆరోపణలు చేశారు. గత శుక్రవారం నాడు న్యూఢిల్లీలో Ycp రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు  మీడియాతో మాట్లాడారు. ఈ విషయమై అన్ని వివరాలతో ప్రధాని Narendra modiకి లేఖ రాయనున్నట్టుగా రఘురామకృష్ణం రాజు తెలిపారు. గుంటూరులో tdp నేత చంద్రయ్యను హత్య చేయడాన్ని రఘురామకృష్ణం రాజు ప్రస్తావిస్తూ వ్యక్తులు నచ్చకపోతే వ్యక్తులను, వ్యక్తులను జగన్ తీసేస్తారన్నారు.  Bjp ఎంపీ Bandi Sanjay ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ విషయంలో స్పందించినట్టుగానే AP Cid చీఫ్ Sunil kumar పై తాను ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ పై స్పందించాలని Loksabha speaker  Om birla కోరారు.

click me!