పీఆర్సీ: ఉద్యోగ సంఘాలతో చర్చలకు కమిటీ ఏర్పాటు చేసిన జగన్

Published : Jan 21, 2022, 02:36 PM ISTUpdated : Jan 21, 2022, 02:46 PM IST
పీఆర్సీ: ఉద్యోగ సంఘాలతో చర్చలకు కమిటీ ఏర్పాటు చేసిన జగన్

సారాంశం

ఉద్యోగ సంఘాలను బుజ్జగించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ కమిటీని ఏర్పాటు చేశారు. పీఆర్సీపై  ఉద్యోగ సంఘాలతో ఈ కమిటీ చర్చించనుంది. 

అమరావతి: Andhra Pradesh  రాష్ట్రంలో పీఆర్సీపై ఉద్యోగ సంఘాల అసంతృప్తిని చల్లార్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలను చేపట్టింది. PRC పై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మూడు జీవోలపై  ఏపీ Employees సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.  ఈ జీవోలను వెనక్కి తీసుకోవాలని  ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరో వైపు ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి.

అయితే పీఆర్సీ విషయమై సీఎం జగన్ తో చర్చిస్తామని అధికారులతో చర్చించబోమని కూడా ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ సమయంలో ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించేందుకు సీఎం YS Jagan కమిటీని ఏర్పాటు చేశారు.

 ఈ కమిటీలో  ఏపీ రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఏపీ రాష్ట్ర  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మతో కమిటీని ఏర్పాటు చేశారు సీఎం జగన్.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం  హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. 30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.

మరో వైపు ఉేద్యోగ సంఘాలు సమ్మె కు వెళ్లాలని భావిస్తున్నాయి. ఈ విషయమై  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసును కూడా ఇవ్వనున్నాయి. ఈ విషయమై  ఉద్యోగ సంఘాలు మరోసారి సమావేశం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎస్ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ ట్రాప్ లో పడుతున్నారని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవోలతో తమకు వేతనాలు తగ్గిపోతాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. అయితే ఈ వాదనతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ విబేధిస్తున్నారు.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం 98 వేల కోట్ల నుండి 62 వేల కోట్లకు పడిపోయిందన్నారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉందని కూడా సీఎస్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం కలగకుండా ఉండేలా జీవోలు జారీ చేశామన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu
RK Roja Bhogi Lecebrations With Family: భోగి రోజు రంగురంగు ముగ్గులు వేసిన రోజా| Asianet News Telugu