ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర డ్యామ్ 14 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తుంగభద్ర డ్యామ్ పూర్తి స్థాయిలో నిండింది. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
కర్నూల్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో Tungabhadra Dam కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఈ డ్యామ్ 14 Gates ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇవాళ ఉదయం తొలుత మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదలల చేశారు. ఆ తర్వాత Dam కు ఎగువ నుండి వరద ఉధృతి పెరగడంతో 14 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర పరివాహక ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచించారు.
also read:ఒడిశాలో చిక్కుకున్న మత్స్యకారులు: గంజాం పోర్టులోకి అనుమతివ్వాలంటున్న విశాఖవాసులు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తుంగభ్ర డ్యామ్ కు రోజుకు ఐదు నుండి ఆరు టీఎంసీల నీరు వచ్చి చేరుతుంది. ఐదు రోజులుగా భారీగా ఈ డ్యామ్ లోకి వరద నీరు వస్తుంది. తుంగభద్ర డ్యామ్ గరిష్ట నీటి మట్టం 100 టీఎంసీలు. భారీ వర్షాలతో ప్రస్తుతం 96 టీఎంసీలకు నీరు చేరింది. దీంతో ఎగువ నుండి వదర ప్రవాహన్ని దృష్టిలో ఉంచుకొని గేట్లు ఎత్తారు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి, రాయచూరు జిల్లాలకు ఈ డ్యామ్ ద్వారా సాగు, తాగు నీరు అందనుంది. దీంతో ఈ డ్యామ్ కింద ఉన్న హెచ్ఎల్‌సీ, ఎల్ఎల్ సీ కాలువల ద్వారా ఆయకట్టుకు కూడా నీరు విడుదల చేశారు అధికారులు.