ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ము మంగళవారం నాడు సమావేశమయ్యారు.ఈ సమావేశం లో తనకు ఓటు వేయాలని ఆమె కోరారు.
అమరావతి:రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున తనకు మీ ఆశీర్వాదాలతో పాటు ఓటు వేసి గెలిపించాలని ద్రౌపది ముర్ము కోరారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏఅభ్యర్ధిగా పోటీ చేస్తున్న Draupadi Murmu, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో మంగళవారం నాడు అమరావతిలో భేటీ అయ్యారు. ఓ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన సమావేశంలో ద్రౌపది ముర్ముతో పాటు ఏపీ సీఎం YS Jagan, కేంద్ర మంత్రి Kishan Reddy, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు Somu Veerrajku తో పాటు YCP ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నన్నయ్య, తిక్కన్న, సోమనాథుడు, ఎల్లాప్రగడ, శ్రీనాధుడు, పోతన,, అన్నమాచార్య, తెనాలి రామకృష్ణుడు, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ వంటి మహానుభావులు పుట్టిన గడ్డగా ఆమె పేర్కొన్నారు.
Andhra Pradesh రాష్ట్రం అన్నింటికి ప్రసిద్దిగా ఆమె చెప్పారు.తిరుపతి, లేపాక్షి వంటి ప్రసిద్ద దేవాలయాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయని ఆమె చెప్పారు. ఒడిశా, ఏపీ రాష్ట్రాలు ఇరుగు పొరుగు రాష్ట్రాలని ఆమె చెప్పారు.ఈ రెండు రాష్ట్రాల ప్రజల ఆహారపు అలవాట్లు, సంస్కృతి, సంప్రదాయాల్లో దగ్గరి పోలికలుంటాయని ఆమె చెప్పారు. తాను గిరిజన సంతతికి చెందినట్టుగా ఆమె ప్రస్తావించారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న తెగ దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉంటారని ఆమె గుర్తు చేశారు. తనకు మద్దతు ఇవ్వాలని సీఎం జగన్ ను కోరిన మీదట సీఎం జగన్ కూడా తన సంపూర్ణ మద్దతు ఇచ్చారని ఆమె చెప్పారు.
undefined
రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్మును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఓ గిరిజన మహిళ దేశ రాష్ట్రపతిగా ఎన్నుకోబడుతున్నారన్నారు రాష్ట్రపతిగా గిరిజన మహిళను ఎన్నుకోవడం బహుశా ఇదే ప్రథమమని సీఎం జగన్ చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మన పార్టీ స్టాండ్ ఏమిటో మీ అందరికి తెలుసునని జగన్ చెప్పారు. సామాజిక న్యాయం వైపు ఉంటూ సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మనదేనని సీఎం జగన్ గుర్తు చేశారు.
also read:ఏపీకి చేరుకున్న ద్రౌపది ముర్ము.. ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం.. టూర్ షెడ్యూల్ ఇదే..
ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవాలని సీఎం జగన్ కోరారు. పార్టీ నిర్ణయాన్ని బలపర్చాలని ఆయన ఎంపీలు, ఎమ్మెల్యేలను కోరారు. పార్టీ విప్ లు తమకు కేటాయించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు వేయడానికి వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ కోరారు. మాక్ పోలింగ్ లో పాల్గొన్న తర్వాతే ఓటు వేసేందుకు వెళ్లాలని ఆయన ప్రజా ప్రతినిధులకు సూచించారు. ఎన్నికల నియమ నిబంధనల మేరకు ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఎం కోరారు. ఏ ఒక్క ఓటు నష్టపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ కోరారు. ఎంపీలను ఓటింగ్ కు తీసుకు వచ్చే బాధ్యతను విజయ్ సాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు తీసుకోవాలని సీఎం జగన్ కోరారు. మరో వైపు మంత్రులు తమ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను ఓటింగ్ కు తీసుకురావాలని సీఎం జగన్ సూచించారు.
అంతకు ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు. సామాజిక న్యాయం కోసం గిరిజన మహిళ అభ్యర్ధిని రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎన్డీఏ బరిలోకి దింపిందన్నారు. ద్రౌపది ముర్ము తమ పార్టీలో కూడా పనిచేసిందన్నారు. ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ వృత్తిని కూడా నిర్వహించిన విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తొలుత ద్రౌపది ముర్ము ఏపీ సీఎం జగన్ నివాసంలో తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్మును సీఎం జగన్ దంపతులు సన్మానించారు.