2023-24 టీటీడీ వార్షిక బడ్జెట్ రూ. 4,411 కోట్లు: వైవీ సుబ్బారెడ్డి

By narsimha lode  |  First Published Mar 22, 2023, 1:00 PM IST

ప్రతి ఏటా  టీటీడీ  వార్షిక బడ్జెట్  పెరుగుతూ వస్తుంది.  2023-24 టీటీడీ బడ్జెట్  రూ. 4,411 కోట్లుగా టీటీడీ అంచనా వేసింది. 


తిరుపతి:2023-24  ఆర్ధిక సంవత్సరం  టీటీడీ బడ్జెట్  రూ. 4,411 కోట్లుగా అంచనా వేసినట్టుగా  టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.  బుధవారంనాడు టీటీడీ చైర్మెన్  వైవీ సుబ్బారెడ్డి తిరుమలలో  మీడియాతో మాట్లాడారు. గత నెల 17న  పాలకమండలి  సమావేశంలో  బడ్జెట్  పై నిర్ణయం తీసుకున్నామని  ఆయన  చెప్పారు.  

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్  కారణంగా  బడ్జెట్ వివరాలు  వెల్లడించలేదన్నారు. టీటీడీ బడ్సెట్ ను రాష్ట్ర ప్రభుత్వం  కూడా ఆమోదిందిచిందని వైవీ సుబ్బారెడ్డి  గుర్తు  చేశారు.  రూ.5.65 కోట్లతో  30 అదనపు  లడ్డూ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్టుగా  ఆయన  తెలిపారు.  తమిళనాడులోని  శ్రీవారి  ఆలయ నిర్మాణపనులకు  రూ. 4.70 కోట్లు ఖర్చు  చేస్తామన్నారు.  ఎస్వీ కాలేజీలో  మూడో అంతస్తు  ఏర్పాటుకు  రూ. 4.78 కోట్లు ఖర్చు చేస్తామని  టీటీడీ చైర్మెన్  వైవీ సుబ్బారెడ్డి  వివరించారు.  

Latest Videos

ఒంటిమిట్టలో  ఈ ఏడాది ఏప్రిల్  6న  సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నట్టుగా  ఆయన చెప్పారు. శ్రీరాముల  కళ్యాణానికి   సీఎం జగన్  పట్టువస్త్రాలు సమర్పిస్తారని   వైవీ సుబ్బారెడ్డి  తెలిపారు.  ఏప్రిల్, మే, జూన్  నెలలో తిరుమలకు  వచ్చే భక్తుల రద్దీ  దృష్ట్యా వీఐపీ  లేఖలను నియంత్రించుకోవాలని  ఆయన  కోరారు.

click me!