తిరుమలకు వచ్చే భక్తులపై ఆంక్షలు: టీటీడీ

Published : Mar 29, 2021, 07:35 PM IST
తిరుమలకు వచ్చే భక్తులపై ఆంక్షలు: టీటీడీ

సారాంశం

తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులపై టీటీడీ ఆంక్షలు విధించింది.శ్రీవారి దర్శనం టికెట్లు ఉన్నవారికే తిరుమలకు అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

తిరుపతి: తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులపై టీటీడీ ఆంక్షలు విధించింది.శ్రీవారి దర్శనం టికెట్లు ఉన్నవారికే తిరుమలకు అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

కరోనా వైరస్ కేసులు రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలను టీటీడీ అమలు చేసింది. నడకదారి భక్తులకు ముందు రోజు ఉదయం 9 గంటల నుండి అనుమతి ఉంటుందని అధికారులు చెప్పారు.

అలాగే వాహనాల్లో వచ్చేవారికి ముందు రోజు మధ్యాహ్నం 1 గంట నుండి అనుమతి ఇస్తామని ప్రకటించారు. మరో వైపు రాష్ట్రంలో  కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదు కావడంతో  ఈ నిర్ణయం తీసుకొన్నామని అధికారులు తెలిపారు. 

గత ఏడాది కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో తిరుమల స్వామివారికి ఏకాంత సేవలను నిర్వహించారు. గత ఏడాది మార్చి మాసంలోనే తిరుమల ఆలయాన్ని మూసివేశారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!