
రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణే అని ఆ పార్టీ నేత నాదేండ్ల మనోహర్ జోస్యం చెప్పారు. సీఎం కాగల సత్తా పవన్ కే ఉందన్నారు.
జనసైనికులు కష్టపడి పనిచేస్తే అనుకున్న లక్ష్యం విజయవంతమవుతుందన్నారు. నిజాయితీగా, నిలకడగా ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కష్టపడి పనిచేసే మనిషి పవన్ అని గత ఎన్నికల్లో చెప్పినా ప్రజలు అర్థం చేసుకోలేదన్నారు.
ఇప్పుడు ఆ సమయం వచ్చిందన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నిన్న చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అని ఆయన చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు.