జగన్ జనరంజకపాలనకు నిదర్శనం: స్థానిక సంస్థల ఫలితాలపై అచ్చెన్నకు మంత్రి అనిల్ కౌంటర్

By narsimha lode  |  First Published Sep 19, 2021, 3:50 PM IST

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం జగన్ పాలనకు నిదర్శనమని ఏపీ  రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. ఇవాళ ఏపీ మంత్రి అనిల్ కుమార్ ఈ ఎన్నికల ఫలితాలపై స్పందించారు.


అమరావతి: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం  వైఎస్ జగన్ పాలనకు నిదర్శనమని ఏపీ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. ఏపీ రాష్ట్ర స్థానికసంస్థల ఎన్నికల ఫలితాలపై  ఆదివారం నాడు ఏపీ మంత్రి  అనిల్ కుమార్ స్పందించారు.విపక్షాలు ఎన్నో కుట్రలతో కేసులు వేసి ఎన్నికల రద్దు కోసం  ప్రయత్నాలు చేశాయని  మంత్రి అనిల్ కుమార్  విమర్శించారు.ఆదివారం నాడు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఫలితాల తీరు చూస్తుంటే గతంలో వచ్చిన ఫలితాల కంటే అత్యధిక స్థానాలను వైఎస్సార్‌సీపీ సొంతం అయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతోందన్నారు.

also read:ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు: ఈ నెల 25 జడ్పీ ఛైర్మెన్ ఎన్నికకు నోటిఫికేషన్

Latest Videos

తాము ఎన్నికలను బహిష్కరించాం అంటున్న నేతలకు సిగ్గుందా అని ఆయన పరోక్షంగా అచ్చెన్నాయుడుపై విమర్శలు గుప్పించారు. టీడీపీ అభ్యర్థులను నిలబెట్టి ప్రచారం చేసింది. కానీ, ఘోరమైన ఫలితాలు వస్తాయని ముందే తెలిసి పారిపోయిందని  మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు టీడీపీ వైపు ఎందుకుంటారు? ఆయా వర్గాలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సంక్షేమ ఫలాలకు తగినట్టుగా ఫలితాలు వచ్చాయని అన్నారు. ప్రజలంతా వైఎస్‌ జగన్‌ను గుండెల్లో పెట్టుకుని తీర్పునిస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ చెప్పారు.

కొందరు నాయకులు హైదరాబాద్‌లో ఉంటేనే మంచిదని ఇక్కడ అడుగుపెడితే కుట్రలు చేస్తారని మండిపడ్డారు. మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డను అడ్డుపెట్టుకుని కుట్ర చేయాలనుకున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పారని మంత్రి తెలిపారు.మున్సిపాలిటీ, పంచాయతీ ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ తిరుగులేని మెజారిటీ సాధించిందని చెప్పారు. చాలా చోట్ల ఏకగ్రీవాలు అయ్యాయని టీడీపీ నేత అచ్చెన్న మాట్లాడుతున్నాడు.. అసలు ఆయా చోట్ల ఆ పార్టీకి ఒక్కరు కూడా నామినేషన్‌ వేయడానికి దిక్కులేదని ఎద్దేవా చేశారు. ఫలితాలను చూసి చంద్రబాబు అయ్యన్నతో మాట్లాడిస్తున్నట్టుందని మండిపడ్డారు. తమకు చేతకాదా? తాము తిట్టలేమా? కానీ తమకు సంస్కారం ఉందని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. 

click me!