ఏపీ స్థానిక సంస్థల ఫలితాలు:జడ్పీఛైర్మెన్, ఎంపీపీ ఎన్నికలకూ టీడీపీ దూరం

By narsimha lode  |  First Published Sep 19, 2021, 4:14 PM IST


జిల్లా పరిషత్ ఛైర్మెన్, ఎంపీపీ ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. ఈ నెల 24న ఎంపీపీ, 25న జిల్లా పరిషత్ ఛైర్మెన్ ఎన్నికలను నిర్వహించనున్నారు.ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలుగుదేశం నిర్ణయం తీసుకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ పోటీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే.


అమరావతి: జిల్లాపరిషత్, మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. ఎంపీపీ, జడ్పీ ఛైర్మెన్ల ఎన్నిక కోసం  రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం నాడు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.

ఏపీ హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు  ఇవాళ ఏపీలో స్థానిక సంస్థల కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. అయితే కొన్ని చోట్ల పార్టీ అధినాయకత్వం నిర్ణయాన్ని ధిక్కరించి టీడీపీ నేతలు పోటీకి దిగారు. అయినా  విజయాలు మాత్రం అంతంతమాత్రమే.

Latest Videos

also read:జగన్ జనరంజకపాలనకు నిదర్శనం: స్థానిక సంస్థల ఫలితాలపై అచ్చెన్నకు మంత్రి అనిల్ కౌంటర్

అయతే ఈ నెల 24న ఎంపీపీ, ఈ నెల 25న జిల్లా పరిషత్ చైర్మెన్ల ఎన్నికలు నిర్వహించనున్నారు.ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయం తీసుకొంది. తక్కువ చోట్లే ఆ పార్టీ అభ్యర్థులు పోటీకి దిగిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయం తీసుకొంది.ఎంపీపీ, జడ్పీ ఛైర్మెన్ ఎన్నికకు ఇవాళే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.


 

click me!