తిరుమల : టీటీడీ ఉచిత బస్సులో మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

Siva Kodati |  
Published : Mar 26, 2022, 06:16 PM IST
తిరుమల : టీటీడీ ఉచిత బస్సులో మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

సారాంశం

తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. టీటీడీ నిర్వహిస్తోన్న ఉచిత బస్సులో మంటలు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తిరుమల రెండో ఘాట్ రోడ్‌లో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. 

తిరుమల రెండో ఘాట్ రోడ్‌లో (tirumala ghat road) టీటీడీ ఉచిత బస్సులో (ttd free bus) మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కాసారిగా బస్సు మొత్తం పొగ వ్యాపించింది. క్షణాల్లోనే మంటలు ఎగిసిపడ్డాయి. దీనిని గమనించిన ప్రయాణీకులంతా కిందకి దిగిపోయారు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న శ్రీవారి సేవకులకు తృటిలో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. శ్రీవారి సేవకులను మరో బస్సులో తరలించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అధికారులు  ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: అధికారులకు చంద్రబాబు హెచ్చరిక | Asianet News Telugu
CM Chandrababu Naidu: చరిత్రలో నిలిచిపోయే రోజు సీఎం చంద్రబాబు| Asianet News Telugu