శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య..

Published : Mar 26, 2022, 04:07 PM IST
శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య..

సారాంశం

శ్రీకాకుళం జిల్లా గూనపాలెంలో దారుణంలో చోటుచేసుకుంది. పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తిని కరుణరాజ్‌‌గా గుర్తించారు. 

శ్రీకాకుళం జిల్లా గూనపాలెంలో దారుణంలో చోటుచేసుకుంది. పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తిని కరుణరాజ్‌‌గా గుర్తించారు. వివరాలు.. గూనపాలెంలో కరుణరాజ్‌తో పాటుగా మరో వ్యక్తి హరిపై శనివారం మధ్యాహ్నం ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో కరుణ్ రాజ్ అక్కడికక్కడే మృతిచెందాడు. హరికి తీవ్ర గాయాలు కావడంతో.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు.  మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

కరుణ‌రాజ్ అనే వ్యక్తి గూనపాలెం సచివాలయంలో వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. కరుణరాజ్ ఇంటి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. కరుణరాజ్ దారుణ హత్యకు గురికావడంతో.. అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం