కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయడం లేదని, భక్తుల ప్రవేశాన్ని మాత్రమే తాత్కాలికంగా నిలిపివేశామని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటికే తిరుమలకు చేరుకుని టైమ్ స్లాట్ తీసుకున్న వారికి స్వామి వారి దర్శనం చేయించి ఇంటికి పంపిస్తామని తెలిపారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయడం లేదని, భక్తుల ప్రవేశాన్ని మాత్రమే తాత్కాలికంగా నిలిపివేశామని ఆయన స్పష్టం చేశారు.
టీటీడీ నిర్ణయాలకు భక్తులు సహకరించాలని అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నుంచి శ్రీవారికి ఏకాంత సేవలు నిర్వహిస్తామని, ప్రస్తుతానికి మాత్రం వారం పాటు ఆంక్షలు ఉంటాయని ఈవో స్పష్టం చేశారు.
undefined
Also Read:శ్రీ వెంకటేశ్వరుని తాకిన కరోనా: తిరుమల ఆలయం మూసివేత
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు సింఘాలు ప్రకటించారు. ఒంటిమిట్టలోని శ్రీరామ ఆలయంలో కల్యాణం ఏకాంతంగా నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు.
టీటీడీ అనుబంధ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తామని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలను నిన్నటి నుంచే మూసివేశామని ఈవో తెలిపారు.
Aslo Read:వారందరికి గృహనిర్బంధ నోటీసులు... కరోనాపై ఏపి వైద్యశాఖ బులెటిన్
గురువారం తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తిలో కరోనా లక్షణాలు కనిపించడంతో టీటీడీ అప్రమత్తమైంది. ఇవాళ్టీ నుంచి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.