కారణమిదే: సుప్రీంలో టిటిడి ప్రధానార్చకుడు వేణుగోపాల దీక్షితులు పిటిషన్

First Published Jun 13, 2018, 2:17 PM IST
Highlights

సుప్రీంకు చేరిన తిరుమల పంచాయితీ


తిరుమల: టిటిడి ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు బుధవారం నాడు సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు చేశారు. తన నియామకాన్ని సవాల్ చేస్తూ ఎవరైనా పిటిషన్ దాఖలు చేస్తే తనకు సమాచారం ఇవ్వకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయకూడదని ఆ పిటిషన్ లో వేణుగోపాల దీక్షితులు కోరారు.

గత మాసంలో టిటిడి ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులను ఆ పదవి నుండి తొలగిస్తూ టిటిడి నిర్ణయం తీసుకొంది.ఈ  విషయమై రమణ దీక్షితులు వచ్చే నెలలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నారు.  అయితే రమణ దీక్షితులు కంటే వేణుగోపాల దీక్షితులే ముందుగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది.

ఇప్పటికే టిటిడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమణ దీక్షితులుపై టిటిడి తాజాగా నోటీసులు జారీ చేసింది. తనను అక్రమంగా ప్రధాన అర్చకుడి పదవి నుండి తొలగించారని ఆరోపిస్తూ రమణ దీక్షితులు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. ఈ తరుణంలోనే ప్రస్తుతం టిటిడి ప్రధాన అర్చకుడిగా ఉన్న వేణుగోపాల దీక్షితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

తన నియామాకాన్ని సవాల్ చేస్తూ ఎవరైనా సుప్రీంను ఆశ్రయిస్తే తనకు తెలియకుండా ఎలాంటి ఆదేశాలను జారీ చేయకూడదని ఆయన  కెవియట్ పిటిషన్ లో సుప్రీం కోర్టును కోరారు. అయితే రమణదీక్షితులు సుప్రీంను ఆశ్రయిస్తే తనకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే  వేణుగోపాల దీక్షితులు సుప్రీంలో కెవియట్ పిటిషన్ దాఖలు చేశారని సమాచారం.

click me!