శారదా పీఠానికి నేతల క్యూ .. స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్న టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

By Siva Kodati  |  First Published May 8, 2022, 5:40 PM IST

విశాఖ శారదా పీఠానికి అధికార పార్టీ నేతల పర్యటనలు సాగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం కొత్తమంత్రులు రోజా, విడదల రజినీ తదితరులు స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. తాజాగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సైతం ఆయనను కలిశారు. 
 


తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్‌ (ttd) వైవీ సుబ్బారెడ్డి (yv subbareddy) శనివారం రాత్రి విశాఖలోని శ్రీ శారదాపీఠాన్ని (visakhapatnam sarada peetham) సందర్శించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర (swaroopanandendra ), స్వాత్మానందేంద్ర (swaroopanandendra) స్వాములను కలిసి వారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నూతనంగా చేపట్టదలచిన కార్యక్రమాలను ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి స్వాములకు వివరించారు. కోవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గి భక్తుల రద్దీ పెరిగిన దృష్ట్యా టీటీడీ తీసుకోవాల్సిన చర్యలపై స్వరూపానందేంద్ర స్వామి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి పలు సూచనలు చేశారు.

ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రిగా బాధ్య‌తలు స్వీక‌రించిన చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా (rk roja) ప‌లు పుణ్య క్షేత్రాల్లో ప‌ర్య‌టిస్తూ పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. ఇప్ప‌టికే ప‌లు ఆల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొన్న ఆమె.. విశాఖ శార‌దా పీఠాన్ని కూడా సంద‌ర్శించారు. అనంతరం స్వ‌రూపానంద స్వామి ఆశీస్సుల తీసుకుని.. రాజ‌శ్యామల అమ్మ‌వారి ఆల‌యంలో రోజా ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సంస్కృతి, యువజన సర్వీసుల శాఖల‌ మంత్రిగా ఆర్‌కే రోజాకు ఏపీ కొత్త‌ కేబినెట్ లో చోటు ద‌క్కిన విష‌యం తెలిసిందే.

Latest Videos

అలాగే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ (vidadala rajini) కూడా స్వరూపానంద ఆశీస్సులు  తీసుకున్న సంగతి తెలిసిందే. విశాఖలోని శారదాపీఠానికి వెళ్లిన ఆమె స్వరూపానంద పాదాలకు నమస్కరించారు. ఈ సందర్భంగా ఆమెతో స్వరూపానంద కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత రజనికి స్వరూపానంద చీరను బహూకరించారు.
 

click me!