ఇకపై పాలకమండలి సమావేశం లైవ్ టెలీకాస్ట్.. టీటీడీలో 17 మందికి కరోనా: వైవీ సుబ్బారెడ్డి

By Siva KodatiFirst Published Jul 4, 2020, 2:48 PM IST
Highlights

టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే పాలకమండలి సమావేశం లైవ్ టెలీకాస్ట్ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు

టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే పాలకమండలి సమావేశం లైవ్ టెలీకాస్ట్ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎస్వీబీసీ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆయన సూచించారు.

ఈ నెల చివరి వరకు భక్తుల సంఖ్య పెంచబోమని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. కరోనా సమయంలో దర్శనం కల్పించడంపైనే దృష్టి పెట్టామని ఆయన చెప్పారు. ఆదాయం కోసం భక్తుల సంఖ్య పెంచామని దుష్ప్రచారం జరుగుతోందని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

17 మంది టీటీడీ ఉద్యోగులు, పూజారులకు కరోనా వచ్చిందని చెప్పిన ఆయన.. ఉద్యోగుల్లో పాలకమండలి మనోధైర్యాన్ని నింపుతుందని సుబ్బారెడ్డి చెప్పారు. ఉద్యోగుల భద్రతపై చర్చించడానికి కమిటీ వేశామని.. 15 రోజుల పాటు ఉద్యోగులు విధులు నిర్వహించేలా మార్పులు చేస్తామని వైవీ స్పష్టం చేశారు.

విధులకు వచ్చ ప్రతీ ఉద్యోగికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని... ఆర్జిత సేవలు ఇప్పట్లో నిర్వహించమని తేల్చి చెప్పారు. శ్రావణ మాసంలో కర్ణాటక వసతి సముదాయం నిర్మాణం ప్రారంభిస్తుందని.. సుమారు రూ.200 కోట్లతో దీనిని నిర్మిస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. కంటోన్మెంట్ నుంచి వచ్చే భక్తులకు అనుమతి ఉండదని టీటీడీ ఛైర్మన్ పేర్కొన్నారు. 

click me!