ఏపీలో కరోనా విశ్వరూపం: ఒక్కరోజే 12 మంది మృతి,17 వేలు దాటిన కేసులు

By Sreeharsha Gopagani  |  First Published Jul 4, 2020, 2:23 PM IST

నిన్న ఉదయం 9 గంటల నుండి నేటి ఉదయం 9 గంటల వరకు 24,962 సాంపిల్స్ ని పరీక్షించగా 727 మంది కరోనా పాజిటివ్ గా తేలారు. దీనితో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 15141 కి చేరింది. ఇతర రాష్ట్రాలవారిని కూడా కలుపుకుంటే 17, 699 కేసులకు చేరుకుంది. 


ఆంధ్రప్రదేశ్ పై కరోనా వైరస్ భూతం పంజా విసురుతోంది. నిన్న ఉదయం 9 గంటల నుండి నేటి ఉదయం 9 గంటల వరకు 24,962 సాంపిల్స్ ని పరీక్షించగా 727 మంది కరోనా పాజిటివ్ గా తేలారు. దీనితో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 15141 కి చేరింది. ఇతర రాష్ట్రాలవారిని కూడా కలుపుకుంటే 17, 699 కేసులకు చేరుకుంది. 

: 04/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 15,141 పాజిటివ్ కేసు లకు గాను
*6437 మంది డిశ్చార్జ్ కాగా
*218 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 8486 pic.twitter.com/QWvPvQ7kr7

— ArogyaAndhra (@ArogyaAndhra)

నిన్నొక్కరోజే 311 మంది కరోనా వైరస్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. నిన్నొక్కరోజే 12 మంది మరణించారు. కర్నూల్, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురేసి చొప్పున ప్రజలు మరణించారు. విశాఖపట్నం, చిత్తూర్ లలో ఇద్దరేసి చొప్పున మరణించారు. కడప, విజయనగరంలలో ఒక్కో మరణం నమోదయింది. ఇప్పటివరకు మొత్తం 218 మంది మరణించారు. 

Latest Videos

రాష్ట్రంలో 9,96,573 సాంపిల్స్ ని టెస్ట్ చేసారు. 9473 మంది కరోనా చికిత్స పొందుతున్నారని, 7453 మంది ఆసుపత్రుల్లో, 2020 మంది కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. 

click me!