Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..

By team teluguFirst Published Nov 14, 2021, 2:50 PM IST
Highlights

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ (ttd) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి (YV Subba reddy) శుభవార్త చెప్పారు. త్వరలో స్వామివారి దర్శనానికి (Srivari darshanam) ఎక్కువ మంది భక్తులను అనుమతించనున్నట్టు ఆయన తెలిపారు.

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ (ttd) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి (YV Subba reddy) శుభవార్త చెప్పారు. త్వరలో స్వామివారి దర్శనానికి (Srivari darshanam) ఎక్కువ మంది భక్తులను అనుమతించనున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అధికారులతో చర్చించి భక్తుల సంఖ్య పెంపుపై నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రోటోకాల్స్ పాటిస్తూ భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. గత మూడు నాలుగు రోజులుగా భారీ వర్షాలు నేపథ్యంలో నడక దారిలో వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. ఇప్పుడు వారికి అడ్డంకులన్నీ తొలగిపోయినట్టుగా చెప్పారు. 

భక్తుల సంఖ్య పెంపుపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌ లోనా లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఇవ్వాలా అనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇక, ప్రస్తుతం టీటీడీ ఆన్‌లైన్ ద్వారా శ్రీవారి దర్శనం కోసం భక్తులకు tickets జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.  

గత నెలలో శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నవంబర్, డిసెంబర్‌ నెలల టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో ఉంచగా.. కొన్ని గంటల వ్యవధిలోనే భక్తులు టికెట్లనుకొనుగోలు చేశారు. అక్టోబర్ 22వ తేదీ ఉదయం 9 గంటలకు టికెట్లు విడుదల చేయగా.. మధ్యాహం 1.30 వరకు టికెట్లు ఖాళీ అయ్యాయి. రెండు నెలలకు గానూ  రోజుకు 12 వేల చొప్పున రెండు నెలలకు 7 లక్షల 8 వేల టికెట్లను విడుదల చేశారు. ఈ టికెట్ల కోసం భక్తుల నుంచి భారీ డిమాండ్ నెలకొంది. ఒక దశలో దర్శన టికెట్ల కోసం ఒక్కసారిగా వెబ్‌సైట్‌లో ఏడు లక్షల హిట్లు వచ్చాయి. ఇక, టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి దాదాపు రూ.21 కోట్ల ఆదాయం లభించింది.

సర్వదర్శనం టికెట్లను కూడా TTD ఆన్‌లైన్‌లోనే ఉంచుతుంది. అయితే పరిమిత సంఖ్యలోనే టికెట్లు జారీ చేస్తుండడంతో చాలా మంది భక్తులకు టికెట్లు లభించలేదు. అయితే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు Covid Vaccine రెండు డోసుల సర్టిఫికెట్‌తో గానీ, కోవిడ్‌ పరీక్ష చేయించుకుని నెగిటివ్‌ రిపోర్టుతో గానీ రావాల్సి ఉంటుంది. 

కరోనా నేపథ్యంలో పరిమితంగానే స్వామివారి దర్శనానికి అనుమతిస్తుండటం, ఆన్‌లైన్ టికెట్లు విడుదల చేయడంతో చాలా మంది సామాన్య భక్తులకు స్వామి దర్శనం దూరమైంది. టికెట్లు ఉన్నవారిని మాత్రమే ప్రస్తుతం దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల సంఖ్యను మరింతగా పెంచాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. 

click me!