ప్రయాణం వాయిదా వేసుకోండి, ఆరు నెలల్లోపుగా దర్శనం కల్పిస్తాం: భక్తులకు టీటీడీ చైర్మెన్ రిక్వెస్ట్

By narsimha lodeFirst Published Dec 1, 2021, 2:42 PM IST
Highlights

భారీ వర్షాల నేపథ్యంలో శ్రీవారి దర్శనం చేసుకొనే భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు.  ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. 

తిరుమల: టెంపుల్ సిటీ తిరుమలతో పాటు పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో  తిరుమలకు వచ్చే భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు టీటీడీ ఛైర్మెన్  వైవీ సుబ్బారెడ్డి. గత మాసంలో  చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల కారణంగా తిరుమల వీధులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటిలోనే ఉన్నాయి. మరో వైపు వర్షాల కారణంగాTirumala ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడుతున్నాయి.  కొండ చరియలు విరిగి పడిన ప్రాంతాన్ని TTD Chairman ఛైర్మెన్  వైవీ సుబ్బారెడ్డి బుధవారం నాడు పరిశీలించారు.ధ్వంసమైన ఘాట్‌ రోడ్డు మరమ్మతులు పూర్తయ్యే వరకు డౌన్‌ ఘాట్‌ రోడ్డులోనే వాహనాల రాకపోకలను అనుమతిస్తామని Yv Subba Reddy తెలిపారు. 

also read:Cyclone Jawad: ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు హై అలర్ట్..

ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు బుక్‌ చేసుకుని వాహనాల్లో వచ్చే శ్రీవారి భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిదని టీటీడీ ఛైర్మన్‌ సూచించారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం ఆన్ లైన్ లో స్లాట్లు బుక్ చేసుకొన్న వారికి  ఆరు నెలల్లోపుగా దర్శనం చేసుకొనే వెసులుబాటును కల్పిస్తామని ఆయన ప్రకటించారు.  అంతేకాదు దర్శనం తేదీని మార్చుకొనే అవకాశం కల్పిస్తామన్నారు. నడకదారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేదని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.తిరుపతి, తిరుమలతో పాటు చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. 

click me!