వైఎస్ పేరును చెడగొడుతున్నారు : జగన్‌పై డీఎల్ రవీంద్రా రెడ్డి విమర్శలు

By Siva KodatiFirst Published Dec 1, 2021, 2:37 PM IST
Highlights

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ (ysrcp) అధినేత వైఎస్ జగన్‌పై (ys jagan mohan reddy) విరుచుకుపడ్డారు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి (dl ravindra reddy) . ప్రతి పథకానికి వైయస్సార్ పేరు పెట్టి ఆయన పేరును చెడగొడుతున్నారని రవీంద్రా రెడ్డి విమర్శించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ (ysrcp) అధినేత వైఎస్ జగన్‌పై (ys jagan mohan reddy) విరుచుకుపడ్డారు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి (dl ravindra reddy) . జగన్ పాలనలో కేవలం కొంతమందికి మాత్రమే న్యాయం జరిగిందన్నారు. ప్రజలందరూ జగన్ పాలనలో ఓడిపోయారని రవీంద్రా రెడ్డి ఎద్దేవా చేశారు. డ్వాక్రా మహిళలకు (dwakra group) ఎంతో ఉపయుక్తమైన అభయహస్తం (abhaya hastham) పథకానికి కూడా జగన్ తూట్లు పొడిచారని ఆయన మండిపడ్డారు.

Also Read:జగన్‌కు అల్టిమేటం.. ఉద్యమానికి సిద్ధం, సీఎస్‌కు నోటీసు ఇచ్చిన ఉద్యోగ సంఘాల నేతలు

విద్యా దీవెన వంటి ఎన్నో పథకాలు నిర్వీర్యమైపోయాయని పేర్కొన్నారు. ప్రతి పథకానికి వైయస్సార్ పేరు పెట్టి ఆయన పేరును చెడగొడుతున్నారని రవీంద్రా రెడ్డి విమర్శించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ఏది చెపితే దానికి తలలు ఊపుతూ అధికారులు సంతకాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పద్ధతిని మార్చుకోకపోతే రానున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు గుణపాఠం చెపుతారని డీఎల్ రవీంద్ర రెడ్డి జోస్యం చెప్పారు. 
 

click me!