తిరుమలకు భక్తుల రద్దీ: ఈ నెల 17వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

By narsimha lodeFirst Published Apr 12, 2022, 11:42 AM IST
Highlights

తిరుపతిలో సర్వ దర్శనం టికెట్ కౌంటర్ల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని  ఆదివారం వరకు వీఐపీ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. సర్వదర్శనం టికెట్ల జారీని కూడా పెంచాలని కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంది.

తిరుపతి: తిరుపతిలోని Sarva Darshanam Ticketsకౌంటర్ల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 13 నుండి ఈ నెల 17వ తేదీ వరకు VIP  బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని  టీటీడీ నిర్ణయం తీసుకుంది. 

రెండు రోజులుగా సర్వదర్శనం టికెట్ల జారీ చేయలేదు. దీంతో ఇవాళ సర్వదర్శనం టికెట్లను జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే  మూడు కౌంటర్ల వద్ద గంటల తరబడి భక్తులు టికెట్ల కోసం ఎదురు చూశారు. భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకొంది. ఈ క్రమంలో  devotees మధ్య తోపులాట చోటు చేసుకొంది. 

ఈ నెల 9వ తేదీనే సర్వదర్శనం టికెట్ల జారీని నిలిపివేసింది.ఈ నెల 12వ తేదీ వరకు శనివారం నాడే టికెట్లను జారీ చేసింది. దీంతో ఆదివారం, సోమవారం నాడు వచ్చిన భక్తులు ఈ నెల 13న స్వామిని దర్శనం చేసుకొనేందుకు సర్వదర్శనం టికెట్ల కోసం ఇవాళ్టి నుండి టికెట్లను జారీ చేస్తున్నారు. 

అయితే ప్రతి రోజూ 30 వేల మంది భక్తులకు మాత్రమే  సర్వదర్శనం టికెట్లను జారీ చేస్తున్నారు. అయితే భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న్ందున ప్రతి రోజూ 30 వేల నుండి 45 వేలకు సర్వదర్శనం టికెట్లను జారీ చేయాలని ఇవాళ TTD నిర్ణయం తీసుకుంది. 

 అయితే సర్వదర్శనం కౌంటర్ల వద్ద భక్తుల మధ్య తోపులాటలు చోటు చేసుకోవడంతో భక్తులందరినీ నేరుగా తిరుమలకు పంపాలని  టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి టికెట్లు లేకుండానే భక్తులకు Tirumalaలో స్వామిని దర్శించుకొనే అవకాశం కల్పిస్తామని కూడా టీటీడీ ప్రకటించింది. తిరుమలకు భక్తులు వెళ్లేందుకు వీలుగా బస్సులను కూడా ఏర్పాటు చేయనున్నారు. సాధారణ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వీఐపీ బ్రేక్ దర్శనాలను ఆదివారం వరకు కూడా నిలిపివేయాలని కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంది.

సర్వదర్శనం టికెట్ల జారీ నిలిపివేత

ఇవాళ సర్వదర్శనం టికెట్ కౌంటర్ల వద్ద భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి టోకెన్ లేకుండానే నేరుగా తిరుమలకు వచ్చేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్ మెంట్ లోకి  రెండేళ్ల తర్వాత భక్తుల్ని అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు.కోవిడ్ కు పూర్వం ఉన్న విధానాన్నే టీటీడీ అవలంభించాలని నిర్ణయం తీసుకుంది.

click me!