సర్వదర్శనం టికెట్ల కోసం తోపులాట, స్పృహ తప్పిన భక్తులు: రంగంలోకి పోలీసులు

By narsimha lodeFirst Published Apr 12, 2022, 10:39 AM IST
Highlights

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్ల కోసం భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకొంది. దీంతో కొందరు భక్తులు స్పృహ తప్పిపోయారు. టికెట్ల కోసం టీటీడీ సరైన ఏర్పాట్లు చేయలేదని భక్తులు మండిపడుతున్నారు.
 

తిరుమల: తిరుమల శ్రీవారి Sarvadarshan Ticketకు భారీ డిమాండ్ నెలకొంది. టికెట్ల కోసం devotees మధ్య తోపులాట చోటు చేసుకొంది.  దీంతో కొందరు భక్తులు స్పృహ తప్పిపడిపోయారు. సర్వదర్శనం టికెట్ల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్  కూడా స్వల్పంగా దెబ్బతింది. సర్వదర్శనం టికెట్ల కోసం గంటల తరబడి భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. 

Tirupati లోని మూడు చోట్ల TTD భక్తులకు సర్వదర్శనం టికెట్లను జారీ చేస్తుంది. టీటీడీ రెండో సత్రం, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం వద్ద టోకెన్లు జారీ చేస్తున్నారు. ఈ మూడు కౌంటర్ల వద్ద కూడా భారీ సంఖ్యలో భక్తులు టోకెన్ల కోసం ఎదురు చూస్తున్నారు. కిలోమీటర్ల దూరం భక్తులు సర్వదర్శనం టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు.   గంటల తరబడి టికెట్ల కోోసం చూసి విసిగిపోయిన భక్తులు టికెట్ కౌంటర్ వద్దకు భక్తులు తోసుకు రావడంతో తోపులాట చోటు చేసుకొంది. సరైన ఏర్పాట్లు చేయని కారణంగా ఈ పరిస్థితి నెలకొంది.  గత రెండు రోజులుగా సర్వదర్శనం టికెట్ల జారీని నిలిపివేశారు.

 దీంతో  ఇవాళ్టి నుండి సర్వదర్శనం టికెట్లను జారీ చేయడంతో భక్తులు పెద్ద సంఖ్యలో టికెట్ల కోసం పోటీ పడ్డారు. అయితే భక్తుల మధ్య తోపులాటను కంట్రోల్ చేయడంలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది చేతులెత్తేశారు. దీంతో తిరుపతి పోలీసులు రంగంలోకి దిగారు. క్యూ లైన్లలో భక్తుల మధ్య తోపులాటతో పలువురు భక్తులు స్పృహ తప్పి పడిపోయారు.కరోనా నేపథ్యంలో గత ఏడాది సర్వదర్శనం టికెట్ల జారీని టీటీడీ నిలిపివేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుండి సర్వదర్శనం టికెట్లను టీటీడీ జారీ చేయడం ప్రారంభించింది.

click me!