టీటీడీ పాలకవర్గ సభ్యుల జాబితాను ఏపీ సర్కార్ ఇవాళ లేదా రేపు విడుదల చేసే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుండి పలువరికి ఈ జాబితాలో చోటు కల్పించింది జగన్ సర్కార్. ఏపీలోని పలువురు ఎమ్మెల్యేలకు చోటు దక్కింది.
అమరావతి: చాలా కాలంగా ఎదురుచూస్తున్న టీటీడీ పాలకవర్గ సభ్యుల జాబితాను ఇవాళో రేపో ఏపీ ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. టీటీడీకి పాలకవర్గాన్ని ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. పాలక వర్గ సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితుల హోదాతో పాలకవర్గాన్ని జంబో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనుంది జగన్ సర్కార్. తొలి విడతలో టీటీడీ పాలకవర్గ సభ్యుల జాబితాను విడుదల చేయనుంది. రెండో విడతలో ప్రత్యేక ఆహ్వానితుల జాబితాను విడుదల చేయనుంది జగన్ సర్కార్.
also read:ఖరారైన టీటీడీ పాలకమండలి: 75 మందికి చోటు, తెలంగాణ నుంచి 10 మందికి అవకాశం
undefined
25 మందితో రెగ్యులర్ పాలక మండలి సభ్యులను నియమించనున్నారు. మిగిలినవారిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించనున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి 10 మందికి టీటీడీ కార్యవర్గంలో చోటు దక్కనుంది.ఏపీ నుండి పోకల ఆశోక్ కుమార్, మల్లాడి కృష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, గొల్ల బాబురావు, మధుసూదన్ యాదవ్ లకు చోటు దక్కినట్టుగా సమాచారం.
తెలంగాణ నుండి రామేశ్వరరావు , లక్ష్మీనారాయణ,పార్ధసారథిరెడ్డి, మూరంశెట్టి రాములు, కల్వకుర్తి విద్యాసాగర్, తమిళనాడు నుండి శ్రీనివాసన్, ఎమ్మెల్యే నందకుమార్, కన్నయ్య, కర్ణాటక నుండి శశిశదర్, ఎమ్మెల్యే విశ్వనాథ్ రెడ్డి, మహారాష్ట్ర నుండి శివసేన కార్యదర్శి మిలింద్ కు అవకాశం లభించనుంది.
ఇదిలా ఉంటే తమిళనాడు నుండి టీటీడీ కార్యవర్గంలో చోటు దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్న కన్నయ్యపై పలు ఆరోపణలున్నాయి.2018లో పీఎంఓ ఆదేశాలతో కన్నయ్యపై రైల్వే విజిలెన్స్ శాఖ సీబీఐ విచారణ కోరింది. రూ.1500 అక్రమాస్తులు కలిగి ఉన్నారని ఆయనపై ఆరోపణలున్నాయి. కన్నయ్య ఛైర్మెన్ గా ఉన్న రైల్వే సోసైటీకి సంబంధించి 108 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. కన్నయ్యను పాలకమండలి సభ్యుడిగా తమిళనాడు సీఎం స్టాలిన్ సిఫారసు చేశారు.