నన్ను కొట్టొద్దంటూ యువతి వేడుకోలు: నెల్లూరులో యువతిపై వ్యక్తి కర్రతో దాడి

By narsimha lode  |  First Published Sep 15, 2021, 9:25 AM IST


నెల్లూరు జిల్లాలో యువతిపై ఓ వ్యక్తి విచక్షణ రహితంగా దాడి చేశాడు.యువతిపై ఎందుకు దాడి చేశాడనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. తనను కొట్టవద్దని ప్రాధేయపడినా కూడ వినకుండా అతను ఆమెపై దాడి చేశాడు.



నెల్లూరు:నెల్లూరు జిల్లాలో యువతిపై ఓ వ్యక్తి విచక్షణరహితంగా కర్రతో దాడికి దిగాడు. కొట్టొద్దని వేడుకొన్నా కూడ పాశవికంగా దాడి చేశాడు. ఈ దాడి వృశ్యాలను వీడియో రికార్డు చేయించాడు. ఈ వీడియోలను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. యువతిపై ఆ వ్యక్తి ఎందుకు దాడి చేశాడనే విషయమై  తెలియాల్సి ఉంది. తమ వాళ్లు చూస్తే బాధపడతారని బాధితురాలు  ప్రాధేయపడుతున్నా ఆ వ్యక్తి మాత్రం  కర్రతో కొట్టడం ఆపలేదు.

కర్రతో కొట్టకుండా అడ్డుకొంటే దుస్తులు చించివేస్తానని  ఆమెను బెదిరించాడు.  తన దుస్తులను చించివేయవద్దని కూడ ఆమె కోరింది. కర్రతో రక్తం కారేలా కొట్టాడు ఆ వ్యక్తి.  ఈ దృశ్యాలను మరికొందరు రికార్డు చేసినట్టుగా ఆ వీడియోలో మాటలు విన్పించాయి. 

Latest Videos

నీకు నిన్న ఏం చెప్పాను, నీవు ఏం చేశావంటూ ఆ వ్యక్తి యువతిపై కర్రతో ఇష్టారీతిలో దాడికి దిగాడు.ఈ వీడియో పోలీసుల దృష్టికి వచ్చింది. యువతిపై దాడి చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడి నెల్లూరు జిల్లా రామ్‌కోటి నగర్ లో చోటు చేసుకొంది.

click me!