ఏపీ, తెలంగాణ విభజన వివాదాల పరిష్కార త్రిసభ్య కమిటీ భేటీ.. వాటిపైనే ప్రధానంగా చర్చ..

Published : Feb 17, 2022, 12:20 PM IST
ఏపీ, తెలంగాణ విభజన వివాదాల పరిష్కార త్రిసభ్య కమిటీ భేటీ.. వాటిపైనే ప్రధానంగా చర్చ..

సారాంశం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి ఏనిమిదేళ్లు గడస్తున్న తెలంగాణ, ఏపీల మధ్య పలు సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ, ఏపీ విభజన వివాదాల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన సబ్ కమిటీ నేడు సమావేశం అయింది.  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి ఏనిమిదేళ్లు గడస్తున్న తెలంగాణ, ఏపీల మధ్య పలు సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ, ఏపీ విభజన వివాదాల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో  సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ త్రిసభ్య కమిటీ గురువారం సమావేశం అయింది. వర్చువల్ విధానంలో ఈ సమావేశం సాగుతుంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి స్పెషల్‌ సీఎస్‌ కె.రామకృష్ణారావు, ఏపీ నుంచి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రావత్ హాజరయ్యారు. విభజన వివాదాలపై ఈ సమావేశంలో చర్చ సాగుతుంది. ముఖ్యంగా అజెండాలో చేర్చిన 5 అంశాలపై ఈ త్రిసభ్య కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చ సాగనుంది. 

అజెండాలోని అంశాలు.. 
-ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ విభజన
- పౌరసరఫరాల సంస్థ ఆర్థిక అంశాలపై చర్చ
-ఏపీ జెన్‌కో సంస్థకు తెలంగాణ డిస్కంల బకాయిలపై చర్చ
-పన్నుల విధానం
- బ్యాంకు డిపాజిట్లు, నగదు పంపకాలపై చర్చ

ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్థిక, ఇతర వివాదాల పరిష్కారంపై చర్చ జరుగుతుంది. తెలంగాణ నుంచి బాకాయిల కోసం ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేసే అవకాశం ఉంది. విద్యుత్ బకాయిల, ఈక్విటీ, పన్నుల కోసం ఏపీ డిమాండ్ చేయనుంది. 

ఇక, ఈ త్రిసభ్య కమిటీ భేటీకి ముందే వివాదం రేగింది. ఈ సమావేశం అజెండాలో తొలుత ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు మొత్తం 9 అంశాలను పెట్టారు. దానితో ప్రత్యేకహోదా అంశం తెరపైకి వచ్చింది. అయితే ఈ భేటీకి సంబంధించిన ఎజెండా విషయంలో కేంద్రం ఏపీకి షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఎజెండా నుంచి తొలగించింది కేంద్రం. త్రిసభ్య కమిటీ అజెండాలో ఏపీ ప్రత్యేకహోదా, రెవెన్యూ లోటు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, పన్నురాయితీలు అనే అంశాలు లేవు. 9 అంశాల నుంచి 5 అంశాలకే అజెండాను పరిమితం చేసింది. మరి ఈ అంశాలపై సమావేశమవుతున్న త్రిసభ్య కమిటీ.. ఎన్ని సమస్యలను పరిష్కరిస్తుందో చూడాలి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?