టీటీడీ కి రూ. 9 కోట్ల 20 లక్షలు విరాళం.. పత్రాలు అందించిన దాత సోదరి...

Published : Feb 17, 2022, 01:30 PM IST
టీటీడీ కి రూ. 9 కోట్ల 20 లక్షలు విరాళం.. పత్రాలు అందించిన దాత సోదరి...

సారాంశం

తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ మొత్తంలో విరాళంగా అందింది. స్వర్గీయ డా. పర్వతం జ్ఞాపకార్థం ఆమె సోదరి రూ. 9 కోట్ల 20 లక్షల విరాళాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అందించారు. 

తిరుమల : TTDకి గురువారం భారీ మొత్తంలో విరాళం అందింది. రూ. 9 కోట్ల 20 లక్షల విరాళాన్ని టీటీడీ చైర్మన్ YV Subbareddyకి అందించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను దాత స్వర్గీయ డాక్టర్ ఆర్ పర్వతం  జ్ఞాపకార్థం ఆమె సోదరి రేవతి విశ్వనాథం శ్రీవారి ఆలయంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి అందజేశారు.


     
చెన్నె మైలాపూర్ కు చెందిన  స్వర్గీయ Dr. R. Parvatam పేరు మీద బ్యాంకులో రూ. 3 కోట్ల 20 లక్షల నగదు డిపాజిట్లు ఉన్నాయి. దీంతోపాటు రూ. 6 కోట్ల విలువైన రెండు ఇళ్ళు ఉన్నాయి. డాక్టర్ పర్వతం కన్నుమూయడంతో ఆమె memoryలో ఆమె సోదరి రేవతి విశ్వనాథం ఈ ఆస్తిని శ్రీ వేంకటేశ్వర స్వామివారికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పత్రాలను శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి అందజేశారు.

కాగా, ఇందులో రూ. 3 కోట్ల 20 లక్షలు చిన్నపిల్లల ఆసుపత్రికి అందించనున్నట్లు.. మిగతా రూ 6 కోట్ల ఆస్తి స్వామివారికి చెందేలా విరాళాన్ని అందించారు. ఈ మేరకు టీటీడీ ప్రజా సంబంధాల అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు.

PREV
click me!

Recommended Stories

Kakinada Blast : కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం.. బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి
CM Chandrababu Naidu Launches HPV Vaccine Program at Cheepurupalli, Ravivalasa | Asianet News Telugu