Tirupati Floods: వర్షం పోయి పొగమంచు వచ్చే.. తిరుమల ఘాట్ రోడ్డు మూసివేత

By Siva KodatiFirst Published Nov 19, 2021, 6:18 PM IST
Highlights

తిరుమల ఘాట్ రోడ్డును మూసివేసింది టీటీడీ. దట్టమైన పొగమంచు కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మొదటి ఘాట్ రోడ్డులోనే రాకపోకలు సాగుతున్నాయి. మరోవైపు శ్రీవారి మెట్టు మార్గంలో కొండచరియలు భారీగా విరిగిపడుతున్నాయి. దీంతో రేపు కూడా ఈ మార్గంలో భక్తులకు అనుమతి ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

తిరుమల ఘాట్ రోడ్డును మూసివేసింది టీటీడీ. దట్టమైన పొగమంచు కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మొదటి ఘాట్ రోడ్డులోనే రాకపోకలు సాగుతున్నాయి. మరోవైపు శ్రీవారి మెట్టు మార్గంలో కొండచరియలు భారీగా విరిగిపడుతున్నాయి. దీంతో రేపు కూడా ఈ మార్గంలో భక్తులకు అనుమతి ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

మరోవైపు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కొండపైకి రాకపోకలు సాగించే రెండు ఘాట్ రోడ్లను మూసివేస్తూ TTD నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  tirumala కొండపైకి కాలినడకన వెళ్లే అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలను నవంబరు 17, 18 తేదీల్లో మూసివేయగా నవంబర్ 19వ తేదీన(ఇవాళ) కూడా మూసి ఉంచనున్నట్లు టిటిడి ప్రకటించింది. అయితే వర్షతీవ్రత ప్రస్తుతం తగ్గిన నేపథ్యంలో ఘాట్ రోడ్లలో వాహనాల రాకపోకలను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. 

ALso Read:తిరుమల వెంకన్న భక్తులకు శుభవార్త... ఏడుకొండలపైకి రాకపోకల పునరుద్ధరణ

అలిపిరి నుంచి తిరుమలకు శుక్రవారం ఉదయం నుంచి ఒక మార్గంలో వాహనాల రాక పోకలను పునరుద్ధరించినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.  తిరుమల నుంచి తిరుపతికి దిగే ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలను టీటీడీ అధికారులు, సిబ్బంది తొలగించారు. భక్తుల సౌకర్యార్థం ఈ మార్గంలో గంట పాటు తిరుమల నుంచి అలిపిరి, గంట పాటు అలిపిరి నుంచి తిరుమలకు చొప్పున వాహనాలను అనుమతించడం జరుగుతోందని అధికారులు తెలిపారు. 

ఇకపోతే.. శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ (imd alert)హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan mohan reddy) వర్ష ప్రభావిత చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఆయా జిల్లాలో వర్షాలు, వరదల పరిస్థితిని తెలుసుకున్న సీఎం జాగ్రత్తలు సూచించారు. ఈ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు, వరద పరిపరిస్థితులకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వెంటనే చర్యలు తీసుకునేందుకుగాను ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. 

click me!