ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో (AP Assembly session) శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అధికార వైసీపీ (YCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) సభ్యులు కొందరు వ్యక్తిగత దూషణలకు దిగారు. మంత్రి కొడాలి నాని (kodali nani) మాట్లాడుతూ.. చంద్రబాబు ముందుగా ప్లాన్ వేసుకనే సభకు వచ్చారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో (AP Assembly session) శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అధికార వైసీపీ (YCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) సభ్యులు కొందరు వ్యక్తిగత దూషణలకు దిగారు. ఆ తర్వాత టీడీపీ అధ్యక్షుడు తాను మళ్లీ సీఎం అయ్యే వరకు అసెంబ్లీలో అడుగుపెట్టబోనని ప్రకటన చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తొలుత సభ ప్రారంభం కాగానే వ్యవసాయ రంగంపై చర్చలో భాగంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. tdp ఐదేళ్లలో చేసిన బీమా కన్నా రెట్టింపు బీమా చేయించామని తెలిపారు. రైతు విత్తనం వేసిన దగ్గర్నుంచే బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, ఈ ప్రక్రియలో 71లక్షల మంది రైతులకు బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. రోజూ సభలో వైసీపీ విజయగాథలు వింటారని వ్యాఖ్యానించారు. హోం మంత్రి అమిత్ షా తిరుపతికి వస్తే రాళ్లు వేయించిన చంద్రబాబు, ఢిల్లీకి వెళ్లినప్పుడు ఆయన కాళ్లు పట్టుకున్నాడు.. అసలు చంద్రబాబు గురించి మాట్లాడితే ఏడాది పాటు సభ పెట్టినా సరిపోదని విమర్శించారు.
ప్రభుత్వ లోన్లతో గేదెలను కొనుగోలు చేసిన రైతులు....హెరిటేజ్‌కే పాలు విక్రయించాలని గతంలో ఆదేశాలు ఇచ్చారని మంత్రి కన్నబాబు తెలిపారు. రైతుల గురించి మాట్లాడితే తనపై పరువు నష్టం కేసు వేశారని కన్నబాబు అన్నారు. మంగళగిరిలో కొడుకు ఓటమినే తట్టుకున్న గుండె అది.. కుప్పం ఎన్నికల్లో ఓటమికి ఏం అవుతుంది అని కన్నబాబు వ్యాఖ్యానించారు. అయితే కన్నబాబు వ్యాఖ్యలపై చంద్రబాబు, టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కన్నబాబు వ్యాఖ్యలను తప్పుబట్టిన టీడీపీ.. ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడం తగదని, తమకు మాట్లేందుకు అవకాశం కల్పించాలని అన్నారు. ఆ సమయంలో కల్పించుకున్న స్పీకర్ తమ్మినేని సీతారామ్.. మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తానని టీడీపీ సభ్యులకు చెప్పారు.
మంత్రి కొడాలి నాని (kodali nani) మాట్లాడుతూ.. ‘ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు.. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికారు. ఆ తర్వాత టీడీపీ చేరి.. వంగి వంగి దండాలు పెట్టాడు. వ్యవసాయానికి దండగ అన్న వ్యక్తి చంద్రబాబు’ అని అన్నారు.
Also read: Chandrababu Naidu: ప్రెస్‌మీట్‌లో బోరున విలపించిన చంద్రబాబు నాయుడు.. వెక్కి వెక్కి ఏడ్చిన వైనం
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendranath reddy) మాట్లాడుతూ.. సభ సజావుగా సాగుతున్న సమయంలో టీడీపీ కావాలనే రచ్చ చేస్తుందని అన్నారు. మొదట వ్యక్తిగతంగా కామెంట్స్ చేసింది టీడీపేనని చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కిరాతకంగా వ్యవహరించారని.. వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై దాడి చేశారని అన్నారు.
Also read: భోరున ఏడ్చిన చంద్రబాబు నాయుడు.. అప్పుడు నేను సభలో లేనన్న ముఖ్యమంత్రి జగన్...
గడికోట శ్రీకాంత్ రెడ్డి (gadikota srikanth reddy) మాట్లాడుతూ.. చంద్రబాబు సభలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బాబాయ్ గొడ్డలి అని ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మల్లెల బాబ్జీ ఆత్మహత్య చేసుకుంటూ ఏం రాశారో ఒకసారి చదువుకోండని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో చెప్పినదాని పట్టుకుని ముఖ్యమంత్రి జగన్‌పై నిందలు వేయడమిటని ప్రశ్నించారు.
అంబంటి రాంబాబు మాట్లాడుతుండగా పోడియం వద్దకు వెళ్లిన టీడీపీ..
అంబంటి రాంబాబు మాట్లాడుతూ.. ‘మేము మాట్లాడిన తర్వాత వారికి అవకాశం ఇవ్వండి. నాపై వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఈ సమావేశాలు పవిత్రమైనవి. మాధవరెడ్డి లాంటి అంశాలపై చర్చించేందుకు సిద్దమా..?. కానీ సభలో దురుద్దేశపూర్వకంగా ఇష్టమెచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు సభ సంప్రదాయాన్ని పాటించడం లేదు. చంద్రబాబు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడటం అని చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారు. కుప్పం విషయాలు బయట వస్తాయనే భయంతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ వెళ్లిపోవాలంటే వాకౌట్ చేసిన వెళ్లిపోవచ్చు’ అని తెలిపారు.
ఈ సమయంలో బాబాయ్, గొడ్డలి అంటూ టీడీపీ సభ్యులు కామెంట్ చేశారు. వైసీపీ నేతలు కూడా రన్నింగ్ కామెంట్రీ చేశారు. ఆ సమయంలో చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏం మాట్లాడుతున్నావంటూ అంబంటిపై మండిపడ్డారు.ఈ క్రమంలోనే టీడీపీ సభ్యులు స్పీకర్ పొడియం వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా సబ్జెక్ట్ డైవర్ట్ చేయవద్దని టీడీపీ సభ్యులను స్పీకర్ కోరారు. ఈ సమయంలో వైసీపీ సభ్యులు కొడాలి నాని, బాలినేని శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొందరు కూడా కూడా పొడియం వద్దకు వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకన్నాయి. స్పీకర్.. ఇరుపక్షాలు వెళ్లి సీట్లలో కూర్చొవాలని అన్నారు.
మళ్లీ సీఎం అయ్యాకే సభకు వస్తా.. చంద్రబాబు
ఈ పరిణామాల నేపథ్యంలో మాట్లాడిన చంద్రబాబు.. ‘సభలో ఎన్నో రకాలు చర్చలు చూశాం.. కానీ ఇంత అవమానం ఎప్పుడూ ఎదుర్కొలేదు. రెండున్నరేళ్లుగా వ్యక్తిగతంగా, పార్టీ పరంగా కించపరిచారు. చాలా అవమానాలు ఎదుర్కొన్నానని.. కానీ ఇలాంటి పరిస్థితులు చూడలేదని అన్నారు. కుప్పం ఫలితాలు తర్వాత కూడా సీఎం జగన్ నా మొహం చూడాలని అన్నారు. దాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఏ పరువు కోసం నేను ఇన్నేళ్లు తాపత్రయపడ్డానో దాన్ని దెబ్బతీస్తున్నారు. చివరకు నా భార్య ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు. నా కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకు లాగారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఉద్వేగానికి లోనయ్యారు. ఆ సమయంలో చంద్రబాబు మైక్ కట్ అయింది. అనంతరం చంద్రబాబు సభలో నుంచి వెళ్లిపోయారు.
ముందే ప్లాన్ చేశారు.. కొడాలి నాని
మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ‘కుప్పం రిజల్ట్స్ వచ్చాక.. అసెంబ్లీ వచ్చాక లోపలికి రాలేదు. ముఖ్యమంత్రి జగన్.. చంద్రబాబు మొహం చూడాలని అనుకున్నాక టీడీపీ నేతలు చర్చలు జరిపారు. నిన్న సాయంత్రం చంద్రబాబు ఇంట్లో నేతలను పిలిచి.. చర్చించుకుని బాయికాట్ చేద్దామని నిర్ణయించుకున్నారు. అసెంబ్లీలో ఏదో ఒకటి చేసి వెళ్లిపోవాలని అనుకున్నారు. చంద్రబాబు ఆవేశంలో తీసుకన్న నిర్ణయం కాదు. ముందుగా ప్లాన్ వేసి ఇలా చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం సొంత మామనే వెన్నుపోటు పొడిచారు. జగన్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన కుటుంబం గురించి చంద్రబాబు, ఆయన మీడియా చాలా దారుణంగా మాట్లాడారు. గ్లిజరిన్ రాసుకొచ్చి.. నటించారని.. దిగజారిపోయాడు. చంద్రబాబు సొంత కుటుంబ సభ్యులనే రోడ్డు మీదకు ఇడుస్తున్నాడు’ అని అన్నారు.ఈ సందర్భంగా కొడాలి నాని చంద్రబాబుపై అసభ్య పదజాలం వినియోగించారు. ఆయన చెప్పిన మాటలు నమ్మవద్దని రాష్ట్ర ప్రజలను కోరారు.
కుటుంబ సభ్యుల విషయం ఎవరూ తీసుకురాలేదు.. బొత్స
చంద్రబాబు కుటుంబ సభ్యుల విషయం తాము ఎవరం సభలో తీసుకురాలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇక్కడ కుటుంబ సభ్యుల గురించి ఎవరూ మాట్లాడలేదని.. కల్పితాల చెప్పి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేయలేదన్నారు. చంద్రబాబులా వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు లేరన్నారు.