రు. 188 కోట్లతో తిరుపతి వికాసానికి టిటిడి నిర్ణయం

Published : Nov 01, 2016, 11:35 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
రు. 188 కోట్లతో తిరుపతి వికాసానికి టిటిడి నిర్ణయం

సారాంశం

తిరుపతి పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు రు. 188 కోట్లు కేటాయిస్తూ టిటిడి పాలక మండలి నిర్ణయం

తిరుఛానూరులో అన్నప్రసాదం కాంప్లెక్స్ ను రు.5.2 కోట్లతో నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నిర్ణయించింది. ఒకటిన్నర సంవత్సరంలో ఈ సముదాయ నిర్మాణం పూర్తి చేయాలి నిర్ణయించారు.

 

ఈ రోజు తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో తితిదే ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విధంగా  తిరుపతి పట్టణాభివృద్ధికి  రూ.188కోట్లు వెచ్చించాలని కూడా పాలకమండలి నిర్ణయించింది.

 

ఇదే విధంగా తెలుగు రాష్ట్రాలలో చేపట్టనున్న ఎనిమిదో విడత మనగుడి కార్యక్రమం కోసం రూ.66.93లక్షలు కేటాయించారు. నవంబర్ 14న  కార్తీక పౌర్ణమి రోజున ఈ కార్యక్రమం నిర్వస్తారు.  నవంబర్ మాసాంతంలోఘనంగా తెలంగాణాలోని శంషాబాద్ శ్రీనివాస కల్యాణం నిర్వహించాలని కూడా టిటిడి  నిర్ణయించింది.

 

మిగతా నిర్ణయాలకు సంబంధించి,అనంతపురం జిల్లా లేపాక్షిలోని గుప్తకామేశ్వరి ఆలయ అభివృద్ధికి రూ.1.60కోట్లు, మైదుకూరు లక్ష్మీనారాయణస్వామి ఆలయ అభివృద్ధికి రూ.26.5లక్షలు , పొదిలిలోని ఆలయ అభివృద్ధికి రూ.25లక్షలు, అమ్మవారి సింహాసనానికి బంగారు తాపడం కోసం రూ.2.67లక్షలు వెచ్చించాలని పాలకమండలి నిర్ణయించింది.
 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Motivational Speech: Superman కాదు.. Hanuman గురించి చెప్పండి | Asianet News Telugu
Chandrababu, Mohan Bhagwat Attends Bharatiya Vigyan Sammelan Inaugural Session | Asianet News Telugu