హోదా కోసం ‘టి‘ ఉద్యమం

Published : Nov 01, 2016, 11:17 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
హోదా కోసం ‘టి‘ ఉద్యమం

సారాంశం

ప్రత్యేకహోదా కోసం టి ఉద్యమం ఈనెల 9న ఉత్తరాంధ్రలో మొదలు పార్లమెంట్ మాజీ సభ్యుడు కొణతాల ఆధ్వర్యం

విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్, ప్రధానంగా ఉత్తరాంధ్రకు దక్కాల్సిన ప్రయోజనాల కోసం ప్రజల్లో చైతన్యం తేవటానికి ఒక వినూత్నమైన ప్రజా ఉద్యమం ఆరంభమవబోతోంది. ఈనెల 9వ తేదీన ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో ఈ ఉద్యమం మొదలవ్వబోతోంది. ఇందుకు పార్లమెంట్ మాజీ సభ్యుడు కొణతాల  రామకృష్ణ ఆధ్యునిగా నిలుస్తున్నారు. మొత్తం మూడు జిల్లాల్లోనూ టీ బంకుల దగ్గర ఏపికి ప్రత్యేక హోదా కోసం, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు కోసం ఈ ఉద్యమం మొదలవుతున్నది.

 ఉదయం నుండి రాత్రి వరకూ ఉద్యోగులు, వృత్తి పనివారు, వృత్తి నిపుణులు, కార్మికులు తదితరులు టీ బంకుల దగ్గరకు వస్తూనే ఉంటారు. ఆ సమయంలో ఏపికి, ప్రత్యేకించి విశాఖపట్నంకు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఏ విధంగా ద్రోహం చేసాయోనన్న విషయాన్ని ప్రజలకు వివరించటానికి కోణతాల టీ బంకులను వేదికగా ఎంచుకున్నారు.

 అసలు విభజన చట్టాన్ని యాధాతధంగా అమోదించాల్సిన కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేకహోదాను ఇవ్వకుండా హోదాకు సమానమైన ప్యాకేజిని ప్రకటిస్తున్నట్లు చెప్పటాన్ని కొణతాల ప్రజలకు వివరించనున్నారు. అసలు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ఆర్ధిక సాయానికి ప్రత్యేక హోదాకు ఏమాత్రం పొంతనలేదని ఆయన తెలిపారు. ప్రత్యేకహోదా వల్ల రాష్ట్రానికి వచ్చే లాభాలను తాము వివరిస్తామని దాని తర్వాత ప్రజల వేసే ప్రశ్నలకు తాము సమాధానాలు ఇస్తామని కొణతాల చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేపడుతున్న ఉద్యమంలో అందరూ పాల్గొనాలని కూడా పిలుపునిచ్చారు.

 తాము అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా ఇస్తామని భాజపా, టిడిపిలు సంయుక్తగా పోయిన ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంగతిని కొణతాల గుర్తుచేసారు. రాష్ట్ర ప్రజలందరూ ఏకతాటిపై రాకపోతే రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే అవకాశం ఉండదన్న విషయాన్ని అందరూ గమనించాలని చెప్పారు. ఏపికి ప్రత్యేకహోదాను నాటి ప్రధానమంత్రి మన్మహన్ సింగ్ రాజ్యసభలో చేసిన ప్రకటనను నేటి అధికార పార్టీలు అపహాస్యం చేస్తున్నట్లు కొణతాల మండిపడ్డారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Motivational Speech: Superman కాదు.. Hanuman గురించి చెప్పండి | Asianet News Telugu
Chandrababu, Mohan Bhagwat Attends Bharatiya Vigyan Sammelan Inaugural Session | Asianet News Telugu