
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ లో జరిగే ఒక సదస్సులో పాల్గోనున్నారు. అందు హైదరాబాద్ ను సుందరంగా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వ యాంత్రాంగం కదిలింది. నవంబర్ చివరి వారంలో హైటెక్స్ లో జరిగే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు ఆమె ప్రత్యేక అతిథిగా వస్తున్నారు.
ఇవాంకా ట్రంప్ మాత్రమే కాదు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సదస్సుకు హాజరయ్యో అవకాశం ఉంది. తెలంగాణ సీఎం కేసిఆర్ ఇప్పటికే ప్రధానిని కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించేలా ఈ సదస్సును నిర్వహించాలని నిర్ణయించింది. దేశంలోనే కాగా ప్రముఖంగా విదేశాలకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లు సదస్సుకు హాజరవుతారని నిర్వాహకులు వెల్లడించారు.
ఈ సదస్సు ఏర్పాట్లపై పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ శనివారం నాడు అధికారులతో సమావేశం అయ్యారు. నగరంలో చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. నవంబర్ వర్షాకాలం కావడంతో ఒకవేళ వర్షాలు పడితే, అతిథులు ప్రయాణించే మార్గాల్లో డ్రైనేజీలు పొంగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
వందలాది మంది అతిథిలు బస చేసే హోటళ్ల నుంచి హైటెక్స్ కు దారితీసే మార్గాలన్నీ అలంకరించడం, రోడ్ల మరమ్మతులకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రధానంగా నగరంలో పంజాగుట్ట నాగార్జున సర్కిల్, జూబ్లీ చెక్ పోస్టు, కేబీఆర్ పార్కు, హైటెక్ సిటీ, మాదాపూర్ జంక్షన్లకు మరమ్మతులను యుద్ధ ప్రతిపదికన పూర్తి చేయ్యాలని ఆయన తెలిపారు, నగరంలో పాడైపోయిన ఫుట్ పాత్ లను వెంటనే బాగు చేయాలని, రోడ్లపై అస్సలు గుంతలు ఉండకూడదని ఆయన సూచించారు.
కోటీ మంది కి పైగా నగరంలో ఉన్న జనాలు రోజు తమ ప్రయాణంలో అష్టకష్టాలు పడుతున్న పట్టించుకోని యంత్రాంగం ఈ సదస్సు కోసం మాత్రం రోడ్లను బాగు చేయ్యడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.