
మత్తయ్య గుర్తున్నాడా? అదేనండి ‘ఓటుకునోటు’ కేసులో ఇరుక్కున్న జెరూసలేం మత్తయ్యే. ఇపుడు ఆయన కూడా చంద్రబాబునాయుడును విమర్శించేస్తున్నారు. ఓటుకునోటు కేసులో ఇరుక్కున్న నాయకులు కూడా తమ ప్రచారం చేయటమంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నట్లే అంటూ బోలెడు బాధపడిపోయారు. వీరిద్దరికీ ఎక్కడ చెడిందో ఏమో? ఈరోజు సాయంత్రం విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పోయిన ఎన్నికల్లో చంద్రబాబు క్రైస్తవులకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కటం ద్వారా క్రైస్తవ ద్రోహిగా మారారంటూ మండిపడ్డారు. నంద్యాల ఉపఎన్నికల్లో తాను ప్రధానపాత్ర పోషించనున్నట్లు చెప్పారు. అంటే ఆమధ్య కెఏ పాల్ చెప్పారు చూడండి బహుశా అటువంటి పాత్ర పోషించాలనుకుంటన్నారేమో. నంద్యాల ఉపఎన్నికలో ఓటుకునోటు కేసు గురించి ప్రజలకు వివరిస్తానంటూ చెప్పటం గమనార్హం. అసలు, నంద్యాల ఉపఎన్నికకు, ఓటుకునోటు కేసుకు, మత్తయ్యకు ఏంటి సంబంధమో అర్ధం కావటం లేదు.