అశ్లీల సైట్లకు బానిసలవుతున్న యువత

First Published Jul 30, 2017, 9:09 AM IST
Highlights
  • యువతలో అత్యధికం పోర్న్ సైట్లే చూస్తున్నారట.
  • బడిపిల్లల్లో కూడా పోర్న్ సైట్లు చూస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగిపోతోంది
  • పట్టణ యువతలో 63 శాతం మంది పోర్న్ వలలో చిక్కుకున్న వారేనట.

అగ్గిపుల్లతో పొయ్యి వెలిగించుకోవచ్చు...ఇల్లూ తగలబెట్టుకోవచ్చు. అది అగ్గిపుల్ల తప్పుకాదు. ఉపయోగించేవారి విచిక్షణ మీద ఆధారపడివుంది.అదేవిధంగా, సాంకేతిక ప్రగతి కూడా అంతే. అశ్లీలం..నెట్టింట్లో నుండి నట్టింట్లోకి వచ్చేస్తోంది. యువతలో అత్యధికం పోర్న్ సైట్లే చూస్తున్నారట. బడిపిల్లల్లో కూడా పోర్న్ సైట్లు చూస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగిపోతోంది. పట్టణ యువతలో 63 శాతం మంది పోర్న్ వలలో చిక్కుకున్న వారేనట. స్మార్ట్ ఫోన్లు చాలామంది అందుబాటులోకి రావటం, మొబైల్ కంపెనీల మధ్య పోటీ కారణంగా ఇంటర్నెట్ ఉచితంగా అందుబాటులోకి రావటంతో కోటాను కోట్ల అశ్లీల సైట్లను

యువత, బడి పిల్లలు చాలా తేలిగ్గా చూసేయగలుగుతున్నారు. తెలుగులో లక్షలాది సైట్లున్నాయట. వీటిల్లో కేవలం ఆడియోలే కాకుండా వీడియోలు కూడా ఉన్నాయి. ఇటువంటి సైట్ల వల్లే పిల్లల్లో, యువతలో నేర మనస్తత్వం పెరిగిపోతోంది. గూగుల్ లో  పోర్న్ అని సెర్చ్ చేస్తే 0.61 సెకన్లలో 189 కోట్ల లింకులు ప్రత్యక్షమవుతాయి. ‘ఇండియన్ సెక్స్’ అని కొడితే 23 కోట్ల లింకులు, తెలుగు సెక్స్ అని టైప్ చేస్తే 12 కోట్ లింకులు కనిపిస్తాయి. అంటే ఇవన్నీ కొట్టి చూడమని ఉద్దేశ్యం కాదు...యువతకు పోర్న్ సైట్లు ఎంత సన్నిహితమైపోతున్నాయో చెప్పటమే ఉద్దేశ్యం.

                                       దేశంలో ఉచిత వైఫై ఉపయోగించే యువతలో 33 శాతం మంది మొదటి ప్రాధాన్యాత పోర్న్ సైట్లేనని ఓ అధ్యయనంలో తేలింది. ఇటువంటి సైట్ల నుండి తమ                                          విద్యార్ధలను దూరంగా ఉంచేందుకు సిబిఎస్ఇ పాఠశాలల యాజమాన్యాలు సెల్ ఫోన్ జామర్లను పెట్టుకోవాల్సి వస్తోందంటేనే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు.                                               అశ్లీల సైట్లను చూసే 63 శాతం యువతలో 74 శాతంమంది మొబైల్ ఫోన్ల ద్వారానే పోర్న్ సైట్లు చూస్తున్నారన్నది ఓ అధ్యయనం చెబుతున్న వాస్తవం.

 

 

 

 

click me!