టిడిపితో దోస్తీ ముగిసింది... జనసేన సంచలన ప్రకటన

Published : Oct 07, 2017, 01:55 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
టిడిపితో దోస్తీ ముగిసింది... జనసేన సంచలన ప్రకటన

సారాంశం

తెలుగుదేశంతో దోస్తీపై జనసేన సంచలన ప్రకటన చేసింది. టిడిపితో దోస్తీ వ్యవహారం 2014 ఎన్నికల వరకే పరిమితమని స్పష్టం చేసింది.

తెలుగుదేశంతో దోస్తీపై జనసేన సంచలన ప్రకటన చేసింది. టిడిపితో దోస్తీ వ్యవహారం 2014 ఎన్నికల వరకే పరిమితమని స్పష్టం చేసింది. జనసేన మీడియా హెడ్ హరిప్రసాద్ శనివారం మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ గురించి మంత్రి పితాని సత్యనారాయణ ఇంట్లో కూర్చుని మాట్లాడటం సరికాదన్నారు. జనసేనకున్న ప్రజాధరణ చూడాలంటే  ఇంట్లో నుండి బయటకు రావాలన్నారు.

అదే సందర్భంలో ప్రత్యేకహోదా కోసం వైసీపీతో కలిసి పనిచేయటాని సిద్దమంటూ కూడా ప్రకటించారు. 2018 మార్చి నాటికి జనసేన పార్టీ నిర్మాణం పూర్తవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లను 60 శాతం కొత్తవారికే కేటాయిస్తామని గతంలో పవన్ కల్యాణ్ చెప్పినట్లే జరుగుతుందని కూడా చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఈనెలలో మొదలుపెడతామని కూడా తెలిపారు. జనసేన సైనికుల ఎంపికకు విశేష స్పందన వచ్చిందన్నారు. పవన్ కార్యక్రమాల గురించి చెబుతూ, అతి త్వరలో పవన్ జనాల్లోకి వస్తారని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert: రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో అల్లకల్లోలమే!| Asianet News Telugu
వారందరిని పార్టీనుండి సస్పెండ్ చేస్తున్న | Dy CM Pawan Kalyan Sensational Comments | Asianet Telugu