ఆ తండా సారాను జయించింది

Published : Apr 27, 2017, 08:40 AM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
ఆ తండా సారాను జయించింది

సారాంశం

ప్రస్తుతానికి వస్తే తండాలో ఎవ్వరూ సారా జోలికి వెళ్ళటం లేదు. ఉదయం లేచింది మొదలు పెద్దలైతే పొలం పనులు, చేతి వృత్తులు, చిన్ని చిన్న వ్యాపారాలు, పిల్లలైతే బడికి వెళ్ళి చదువుకోవటంతో బిజి బిజీగా ఉంటున్నారు. అన్నీ తండాలు, గ్రామాలూ ఇదే విధంగా ఎంతా బావుంటుందో కదా?

ఆ తండా ప్రస్తుతం సారాకు దూరం. తయారు చేయరంటే..తాగుతారని కాదు. తయారు చేయరు, అసలు ముట్టుకోరు. మొదటి నుండి ఇంతే అనుకునేరు. ఒకపుడు తండాలో ఎక్కువ కుటుంబాలు 24 గంటలూ సారాలోనే జోగేవి. ఇదంతా రెండు దశాబ్దాల్లో వచ్చిన పరివర్తనే. చాలా తండాల్లాంటిదే హెడి తండా కూడా.

ఒక తెలుగు మీడియాలో వచ్చిన కథనం ప్రకారం అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అగళిమండలంలో ఉంది హెడీ తండ. పేరును బట్టే తెలుసుకోవచ్చు తండాలో ఉండేదంతా గిరిజనులేనని. చాలా తండాల్లో ఉన్నట్లే మూడు దశాబ్దాల క్రితం వరకూ తండాలో నివసించే వారి ఆదాయం దాదాపు సారా కాయటంపైనే వచ్చేది. తండాలో ఉండే కొందరు సారా తయారీని, తాగటాన్ని వ్యతిరేకించినా పెద్దగా ఎవరూ లెక్క చేయలేదు.

అయితే, ఒకసారి సారా తాగటం వల్ల కొదరు చనిపోయారు. దాంతో పోలీసుల కళ్లు ఈ తండాపై పడింది. దాంతో వారసత్వంగా తండాలో సారా తయారీ బ్రహ్మాండంగా సాగుతోందిన పోలీసులు తెలుసుకున్నారు. ఇంకేముంది పోలీసుల కళ్ళల్లో పడితే అంతే సంగతులు కదా?

దాంతో వేధింపులు మొదలయ్యాయి. అసలే తండాలో కావల్సిన వారి మరణాలతో కృంగిపోతున్నవారికి పోలీసు విచారణలు మరింత చికాకుని తెప్పించాయి. ఎప్పటినుండో సారా తయారీ, తాగటాన్ని మాన్పించేందుకు కృషి చేస్తున్న బాల్యా నాయక్ అనే వ్యక్తికి గట్టి మద్దతు లభించింది. తనతో కలిసి వచ్చే ఆడ, మగతో కలిసి సారాకు దూరంగా ఉండేందుకు తండాలోని పెద్దలను ఒప్పించారు. దాంతో మెల్లిగా సారా తయారీ, త్రాగటం తగ్గింది. వారందరికీ పొలాలున్నా పెద్దగా దృష్టి పెట్టలేదు.

ఎప్పుడైతే సారా వ్యాపకం నుండి బయటపడుతున్నారో వెంటనే తండాకు ఆనుకునే ఉన్న తమ పొలాల సాగుపై అందరూ దృష్టి పెట్టారు. దానికి తోడు బాల్యా నాయక్ నాయకత్వంలో అధికారులను కలిసి తమ పరిస్ధితిని చెప్పుకున్నారు. అధికారులు కూడా స్పందించారు. వ్యవసాయం నిమ్మితం అదనంగా భూమిని ప్రభుత్వం అందించింది. దానికితోడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందటం మొదలైంది. దాంతో మిగిలిన వారిలో కూడా చైతన్యం మొదలైంది..

అంతే, అప్పటి నుండి అందరూ సారాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దాంతో తండాలోని కుంటుంబాల్లో ఆనందం తొంగిచూడటం మొదలైంది. ప్రస్తుతానికి వస్తే తండాలో ఎవ్వరూ సారా జోలికి వెళ్ళటం లేదు. ఉదయం లేచింది మొదలు పెద్దలైతే పొలం పనులు, చేతి వృత్తులు, చిన్ని చిన్న వ్యాపారాలు, పిల్లలైతే బడికి వెళ్ళి చదువుకోవటంతో బిజి బిజీగా ఉంటున్నారు. అన్నీ తండాలు, గ్రామాలూ ఇదే విధంగా ఎంతా బావుంటుందో కదా?

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu
Kandula Durgesh Super Speech: ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి | Asianet News Telugu