చంద్రన్నను కలవాలంటే వెయ్యి డాలర్లు చెల్లించాల్సిందే

First Published Apr 27, 2017, 7:50 AM IST
Highlights

పేరుకే ఉచిత ప్రవేశమని వెళితే వెయ్యి డాలర్ల చేతి చమురు వదిలించుకోవాల్సిందేనని తెలిసే సరికి హాజరవ్వాలని అనుకుంటున్నవారు కూడా వెనక్కు తగ్గుతున్నారట.

అమెరికాలోని తెలుగు వాళ్లకి బంపర్ ఆఫర్. అదేంటంటే అమెరికాలో చంద్రబాబు కార్యక్రమాల్లో పాల్గొనాలంటే వెయ్యి డాలర్లు సమర్పించుకోవటం. వచ్చే నెల 3-11 తేదీల మధ్యలో చంద్రబాబు పెద్ద బృందంతో అమెరికాలో పర్యటిస్తున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటించనున్నారు. అయితే, కొందరు అత్యుత్సాహవంతులు మాత్రం చంద్రబాబు పర్యటన సందర్భంగా ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. చంద్రబాబు పాల్గొనే సభల్లో ముందు వరసల్లో కూర్చోవాలంటే ‘వెయ్యి డాలర్లు’ చెల్లించాలని షరతులు పెడుతున్నారు.

దాంతో విషయం విన్న వారంతా నివ్వెరపోతున్నారు. చంద్రబాబును కలవాలంటే తామెందుకు వెయ్యి డాలర్లు చెల్లించాలో వారికి అర్ధం కావటం లేదు. ఒకవైపు చంద్రబాబు పలానా నగరంలో పలానా కార్యక్రమాల్లో పాల్గంటారు రండిబాబు రండి అంటూ ఊదరగొడుతున్నారు. ఇంకోవైపేమో ఆశక్తి ఉన్న వారు చంద్రబాబు కార్యక్రమాలకు హాజరవుదామనుకుంటే వెయ్యి డాలర్లు చెల్లించమని అడుగుతున్నారు.

రమ్మని ఆహ్వానాలు పంపటమెందుకు? వస్తామని చెప్పగానే వెయ్యి డాలర్లు చెల్లించమని అడగటమేమిటంటూ ఎన్ఆర్ఐలు విస్తుపోతున్నారు. ఇదేమీ నిధుల సేకరణ సభలు కాదుకదా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే ఉచిత ప్రవేశమని వెళితే వెయ్యి డాలర్ల చేతి చమురు వదిలించుకోవాల్సిందేనని తెలిసే సరికి హాజరవ్వాలని అనుకుంటున్నవారు కూడా వెనక్కు తగ్గుతున్నారట.

పెట్టుబడుల సేకరణ లక్ష్యంతో అధికారికంగా చంద్రబాబు అమెరికాలో పర్యటిస్తుంటే నిర్వాహకుల్లో కొందరు మాత్రం పర్యటనను క్యాష్ చేసుకుందామని చూస్తుండటం పట్ల సర్వత్రా వ్యతిరేకత మొదలైంది. ఈ వెయ్యా డాలర్ల ఐడియా ఎవరిదో గానీ మొత్తానికి చంద్రబాబు పర్యటన మత్రం నవ్వులపాలయ్యేట్లుగా ఉందని అనుకుంటున్నారు.

click me!